Home
Mobile

బెస్ట్‌ వాటర్‌ ప్రూఫ్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నారా.. 50MP +50MP కెమెరాల ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్‌!

భారత్‌ మార్కెట్‌ లోకి ఇటీవల రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Realme GT 7 Pro Smartphone Sale) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ తాజాగా ప్రారంభం అయింది. ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ లో అందుబాటులోకి వచ్చింది. డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కర్వడ్‌ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. రెండు 50MP కెమెరాలను కలిగి ఉంది. ప్రారంభ సేల్‌ లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌లలో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ సహా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 12GB ర్యామ్‌ ధర రూ.59,999, 16GB ర్యామ్‌ వేరియంట్ ధర రూ.65999 గా ఉంది.

Realme GT 7 Pro Smartphone sale details

అయితే ప్రారంభ సేల్‌లో భాగంగా ఈ రియల్‌మి ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. అన్ని బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.56,999 గా ఉంది. అదే 16GB వేరియంట్ ధర రూ.62,999 గా ఉంది. గెలాక్సీ గ్రే, మార్స్‌ ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది.

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ LTPO అమోలెడ్‌ క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 6500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌, HDR 10+ ను సపోర్టు చేస్తుంది.

Realme GT 7 Pro Smartphone sale details

ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు అల్యూమినియంతో కూడిన AG గ్లాస్‌ ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా తోపాటు 50MP సోనీ IMX882 టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం రియల్‌మి ప్రీమియం ఫోన్‌ 16MP కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మి UI 6.0, 3nm స్నాప్‌డ్రాగన్‌ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 16GB LPDDR5X ర్యామ్‌ మరియు గరిష్టంగా 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 3 సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ పొందనుంది.

రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 120W ఫాస్ట్‌ ఛార్జర్‌ను సపోర్టు చేస్తుంది. 30 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చని సంస్థ తెలిపింది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ బ్లూటూత్‌ 5.4, W-Fi 6 సహా మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో మెరుగైన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన వాటర్‌ ప్రూఫ్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Realme GT 7 Pro Smartphone sale is live on amazon and get RS3000 discount on bank cards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X