Game Changing: 10,000mAh భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో రియల్‌మి GT 7 సిరీస్.. కీలక వివరాలు లీక్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి భారత్‌లో త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందుకు సంబంధించి కీలక వివరాలను విడుదల చేసింది. రియల్‌మి GT 7 సిరీస్ (Realme GT 7 Series) పేరుతో భారత్ మార్కెట్‌లోకి రానుంది. దీంతోపాటు ఈ ఫోన్‌కు కీలక స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడించింది. ఇటీవలే రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ చైనాలో విడుదల అయింది.
ఈ రెండు ఫోన్‌లు విడుదల కానున్నాయా? :
అయితే భారత్ మార్కెట్‌లో రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T మోడల్స్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను సంస్థ X హ్యాండిల్ ద్వారా విడుదల చేసింది. Power that never stops పేరుతో టీజర్ రిలీజ్ చేసింది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడించలేదు.

భారీ బ్యాటరీ :
ఈ సిరీస్ శక్తివంతమైన చిప్‌సెట్‌తోపాటు భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని సమాచారం. గేమింగ్ సమయంలో 120 fps BGMI గేమ్ ప్లేను అందిస్తుందని తెలుస్తోంది.
BIS వెబ్‌సైట్‌లో :
ఇటీవలే రియల్‌మి GT 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది. దీని ఆధారంగా రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ RMX5061, అదే GT 7T ఫోన్ RMX5085 మోడల్ నంబర్లను కలిగి ఉన్నాయి.

అయితే ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్ల వివరాలను రియల్‌మి వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లీక్స్ ఆధారంగా రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 8GB చిప్‌సెట్‌తో జతచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
చైనా వేరియంట్ ఆధారంగా రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని సమాచారం మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది.
The #realmeGT7Series is leading the next leap in battery innovation, with a game-changing 10000mAh powerhouse.
— realme (@realmeIndia) May 6, 2025
The future of endurance is here.
Know More: https://t.co/ri6iG9AVbQ https://t.co/z8Dhu2oiAJ#PowerThatNeverStops #2025FlagshipKiller pic.twitter.com/L3KP8CEagi
గేమ్ ఛేంజింగ్ బ్యాటరీ :
తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా రియల్‌మి GT 7 సిరీస్ తోపాటు ఓ కాన్సెప్ట్ ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఏకంగా 10000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. బ్యాటరీ విభాగంలో గేమ్ ఛేంజర్‌గా దీనిని పరిగణించవచ్చు. అయితే ఛార్జింగ్ సామర్థ్యం సహా ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
* భారత్ మార్కెట్‌లో ఇటీవలే రియల్‌మి C75 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.12,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.13,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
ఈ రియల్‌మి C75 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ సపోర్టు చేస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తుంది. 32MP Galaxycore GC32E2 ఆటోఫోకస్ కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








