7500mAh, 6000mAh భారీ బ్యాటరీలు, శక్తివంతమైన ప్రాసెసర్‌లతో రియల్‌మి GT 7 సిరీస్ ఫోన్‌లు..!
Realme GT 7 Series : రియల్‌మి నుంచి GT 7 సిరీస్ ఈనెలలోనే విడుదల కానుంది. ఇందులో భాగంగా రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T ఫోన్‌లు అందబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన అనేక వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ సిరీస్ మే 27 తేదీ మధ్యాహ్నం 1.30 PM (IST) లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్‌లు రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో రూ.45 వేల ప్రారంభ ధరకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అదే రియల్‌మి GT 7T హ్యాండ్‌సెట్ సుమారు రూ.35 వేల ధరకు విడుదల అయ్యే అవకాశం ఉంది. ధర వివరాలతోపాటు ఈ ఫోన్‌లకు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్‌లు కూడా లీక్ అయ్యాయి.

రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో 6.8 LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ కానుందని భావిస్తున్నారు. 120W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేయనుందని తెలుస్తోంది.
రియల్‌మి GT 7T హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పై పనిచేస్తుంది. ఈ సిరీస్ మే 27 వ తేదీన భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. అప్పటిలోగా మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే ఏకంగా 6000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మెరుగైన డిస్‌ప్లే, డిజైన్‌తోపాటు శక్తివంతమైన చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుందని సమాచారం. IP68/IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ రియల్‌మి GT 7 హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుంది.
అయితే ఈ ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ కానుందని భావిస్తున్నారు. 120W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7500mAh భారీ బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో అనేక సంస్థలు భారీ బ్యాటరీలతో ఫోన్‌లు లాంచ్ చేశాయి. వీటికి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








