50MP + 50MP కెమెరాలు, 7000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల భారీ డిస్‌ప్లేతో రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్..!
Realme GT 7 Smartphone : రియల్‌మి ఇవాళ భారత్ మార్కెట్‌లో మూడు స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఇందులో రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T తోపాటు రియల్‌మి GT 7 డ్రీమ్ ఎడిషన్ ఫోన్‌లు ఉన్నాయి. రియల్‌మి బడ్స్ ఎయిర్ 7 ప్రో కూడా లాంచ్ అయ్యాయి. రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. మరియు 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ను కలిగి ఉంది.
40 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ :
ఈ చిప్‌సెట్ PUBG, BGMI కోసం 120fps సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ AI ట్రాన్స్‌లేటర్, AI గ్లేర్ రిమూవల్, AI ల్యాండ్‌స్కేప్+ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 120W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 1-100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 40 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.
రెండు 50MP కెమెరాలు :
ఈ రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS సపోర్టుతో 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ వెనుక కెమెరాలు 120fps తో 4K స్లో మోషన్ వీడియోలను రికార్డు చేయవచ్చు. అదే సెల్ఫీ కెమెరాతో 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ బ్లూటూత్ 5.4, వైఫై 7, NFC, GPS వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
The #realmeGT7 is built for the limitless.
— realme (@realmeIndia) May 27, 2025
Powered by the MediaTek Dimensity 9400e chipset and a massive 7000mAh battery with 120W charging, this #2025FlagshipKiller keeps you going without pause.
Starting from ₹34,999*! Sale starts May 30th, 12 PM
Existing GT Users get the… pic.twitter.com/qHskSZsSef
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ (Realme GT 7 Sale Date) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.46,999 గా ఉంది.
ఈ ఫోన్‌ను ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. మరియు మే 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఐస్‌సెన్స్ బ్లూ, ఐస్‌సెన్స్ బ్లాక్ వంటి రెండు కలర్ వేరియంట్స్‌లో ఉంది.
రియల్‌మి GT 7 డ్రీమ్ ఎడిషన్ :
రియల్‌మి GT 7 డ్రీమ్ ఎడిషన్ ఫోన్ కూడా లాంచ్ అయింది. ఈ ఫోన్‌ను ఆస్టన్ మార్చిన్ అరాంకో ఫార్ములా 1 టీమ్‌తో కలిసి రూపొందించింది. ఈ ఫోన్ వెనుక వైపు ఫార్ములా వన్ టీం పేరు, సిల్వర్ వింగ్ లోగోను కలిగి ఉంది. ఈ ఫోన్ రిటైల్ బాక్స్‌లో F1 రేస్‌కార్ సిమ్ కార్డ్ పిన్, ఆస్టన్ మార్టిన్ F1 రేస్‌కార్ తరహాలో ఉండే సిల్వర్ వింగ్ ఫోన్ కేస్‌ను ను కలిగి ఉంది. దీంతోపాటు కస్టమ్ వాల్‌పేపర్స్, ఐకాన్, థీమ్స్ ను కూడా పొందవచ్చు.
Perfection is a dream, but not for the obsessed.
— realme (@realmeIndia) May 27, 2025
In the #realmeGT7DreamEdition, every curve, every millimeter, and every millisecond is meticulously crafted.
Built to break limits. Built by obsession.
Starting from ₹49,999*! Sale starts June 13th, 12 PM
Includes 1-year screen… pic.twitter.com/dUzLsVtwyw
ఈ డ్రీమ్ వేరియంట్ స్టాండర్డ్ Realme GT 7 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. రియల్‌మి GT 7 డ్రీమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 16GB స్టోరేజీ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆస్టన్ మార్టిన్ సిగ్నేచర్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








