మీడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్, 40 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్, బెస్ట్ ఫీచర్‌లతో రియల్‌మి GT7 ఫోన్
Realme GT 7 Smartphone: రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లోకి మే 27 వ తేదీన రియల్‌మి GT 7 సిరీస్ ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి GT 7 మరియు రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. హెవీ యూజర్లకు ఈ ఫోన్ అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
శక్తివంతమైన చిప్‌సెట్ :
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని రియల్‌మి చెబుతోంది. మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్ సమయంలో ఈ ప్రాసెసర్ అత్యంత మెరుగైన పనితీరు అందిస్తుందని రియల్‌మి చెబుతోంది.

దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ AnTuTu స్కోర్‌ను కూడా రియల్‌మి వెల్లడించింది. ఈ ఫోన్ 2.45 మిలియన్ AnTuTu బెంజ్‌మార్క్ స్కోర్‌ను సాధించినట్లు తెలిపింది. హెవీ యూజర్లకు ఈ ఫోన్ అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.
కేవలం 40 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ :
ఇప్పటికే ఈ రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ, ఛార్జింగ్ స్పెసిఫికేషన్‌ల గురించి ఇటీవలే వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఛార్జర్‌తో కేవలం 40 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేయవచ్చని రియల్‌మి చెబుతోంది.
ప్రత్యేక టెక్నాలజీ :
యూజర్ల రోజువారీ ఛార్జింగ్ అవసరాలు తీర్చేలా ఈ ఫోన్ పనితీరు ఉంటుందని చెబుతోంది. ఇందుకోసం DCX స్టెప్‌డౌన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు చెప్పింది. బ్యాటరీ వినియోగంపై పర్యవేక్షణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) ను కలిగి ఉంటుందని తెలిపింది.
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ 6000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.78 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ 6.8 LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. 120W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని భావిస్తున్నారు.
రియల్‌మి GT 7 సిరీస్ ధర వివరాలు :
భారత్ మార్కెట్‌లో రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్ రూ.45 వేల ప్రారంభ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. రియల్‌మి GT 7T ఫోన్ రూ.35 వేల ధరకు విడుదల అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు ఫోన్‌లు మే 27 వ తేదీ 1;30 PM గంటలకు లాంచ్ కానున్నాయి.


Click it and Unblock the Notifications








