6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీతో రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ విడుదల..!
Realme GT 7T Smartphone : రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ ఇవాళ భారత్ మార్కెట్లో విడుదల అయింది. రియల్‌మి GT 7 సిరీస్‌లో భాగంగా ఈ పోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 6.80 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఇవాళ్టి నుంచి ప్రీ బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు.
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 205 గ్రాముల బరువును కలిగి ఉంది.

వేపర్ కూలింగ్ ఛాంబర్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 Max చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 7700mm Sq సింగిల్ యూనిట్ వేపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని రియల్‌మి తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ 120W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ వైఫై 6, బ్లూటూత్ 6, GPS, NFC ఫీచర్‌లు ఉన్నాయి.
True POWER is now within reach.
— realme (@realmeIndia) May 27, 2025
The #realmeGT7T is making its entrance, elevating your smartphone experience with the MediaTek D9400e Chipset, 7000mAh battery + 120W charging, and the AI Travel Snap Camera.
Ready to experience the #2025FlagshipKiller?
Starting from ₹28,999*!… pic.twitter.com/QywL91mGXJ
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.41,999 గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్ సేల్ మే 30 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా ఆన్‌లైన్ స్టోర్ తోపాటు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఫోన్ ఐస్‌సెన్స్ బ్లాక్, ఐస్‌సెన్స్ బ్లూ, రేసింగ్ యెల్లో కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








