Home
Mobile

రియల్‌మి GT 7T ధర వివరాలు లీక్.. 7000mAh భారీ బ్యాటరీ, 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే సహా..!

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లోకి ఈనెల 27 వ తేదీన రియల్‌మి GT 7 సిరీస్‌ విడుదల కానుంది. ఇందులో GT 7 మరియు GT 7T స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. బ్యాటరీ, ఛార్జింగ్‌ స్పీడ్‌, చిప్‌సెట్‌ వంటి వివరాలను సంస్థ వెల్లడించింది. 7000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలిపింది.

డిస్‌ప్లే వివరాలు :
తాజాగా రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్‌ (Realme GT 7T Smartphone) వివరాలు వెల్లడయ్యాయి. రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేన కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 6000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

Realme GT 7T Smartphone price leaked in india expected to launch with 7000mAh large battery

7000mAh భారీ బ్యాటరీ :
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్‌ మూడు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. రియల్‌మి సిగ్నేచర్‌ డిజైన్‌తో కూడిన లైట్‌ బ్లూ, బ్లాక్‌, యెల్లో/బ్లాక్‌ రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో విడుదల కానుందని తెలుస్తోంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 MAX చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్‌, 512GB స్టోరేజీని సపోర్టు చేసే అవకాశం ఉంది. రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realm UI 6.0 పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 6.0, వైఫై 6 వంటి ఫీచర్‌లు ఉంటాయని సమాచారం. పైన తెలిపిన ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లపై రియల్‌మి ఎటువంటి ప్రకటన చేయలేదు.

రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.35,000 రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా టిప్‌స్టర్‌ సుదన్షు అంబోర్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.34,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999 గా ఉంటుందని తెలిపారు.

టిప్‌స్టర్‌ పరాస్ గుగ్‌లానీ కూడా ఇదే తరహా వివరాలను వెల్లడించారు. అయితే రియల్‌మి GT 7T హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39999 గా ఉంటుందని తెలిపారు. అయితే రియల్‌మి సంస్థ ఈ ధరల వివరాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
రియల్‌మి GT 7 సిరీస్‌లోని మరో ఫోన్‌ రియల్‌మి GT 7 హ్యాండ్‌సెట్‌ కూడా విడుదల కానుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 2.45 మిలియన్‌ AnTuTu బెంచ్‌మార్క్‌ స్కోర్‌ను కలిగి ఉందని తెలిపింది. గేమింగ్‌, హెవీ యూజర్లకు ఈ ఫోన్ సౌకర్యవంతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

చిప్‌సెట్‌తోపాటు బ్యాటరీ వివరాలు కూడా వెల్లడయ్యాయి. రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్‌ 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం 40 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌ చేయవచ్చని రియల్‌మి చెబుతోంది. బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ కోసం ప్రత్యేక టెక్నాలజీపాటు AI ఫీచర్‌లను ఉపయోగిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT 7T Smartphone price leaked in india expected to launch with 7000mAh large battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X