200MP కెమెరా, 7000mAh బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌తో 5G ఫోన్ సేల్ ప్రారంభం..!
Realme GT 8 Pro Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి భారత్ మార్కెట్‌లో ఇటీవల తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 200MP కెమెరా, 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ ప్రారంభం అయింది.
రూ.5000 డిస్కౌంట్ :
రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.72,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.78,999 గా ఉంది. ఇవాళ 12 PM నుంచి సేల్ ప్రారంభం అయింది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ రియల్‌మి ఫోన్‌ను రియల్‌మి ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డైయిరీ వైట్, అర్బన్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్ క్వాల్‌కాం 3nm ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. దీంతోపాటు Adreno 840 GPU ను కూడా కలిగి ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 7000 sq mm తో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 120W వైర్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ రియల్‌మి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 6.79 అంగుళాల QHD+ BOE Q10 ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా Ricoh GR ట్యూనింగ్ ను కలిగి ఉంది. వెనుక వైపు మూడు కెమెరాలున్నాయి. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్ లెన్స్, 120x డిజిటల్ జూమ్‌తో 200MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరా ఉంది. 60fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.
రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ 5G, Wi-Fi, బ్లూటూత్ 6.0, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. దీంతోపాటు ఇ-కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సర్, యాక్సెలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాంబియంట్ సెన్సర్, టెంపరేచర్ సెన్సర్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








