Home
Mobile

200MP కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్‌, 7000mAh భారీ బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్!

Realme GT 8 Pro Smartphone : రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్లో విడుదల అయింది. డిజైన్‌ పరంగానూ ఈ ఫోన్‌ ఆకట్టుకొనే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌తో పనిచేస్తుంది. రియల్‌మి GT 8 ప్రో డ్రీమ్‌ ఎడిషన్‌ కూడా విడుదల అయింది. కెమెరా విభాగం పరంగానూ మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో భారీ బ్యాటరీలను కలిగి ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రియల్‌మి GT 8 ప్రో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.79 అంగుళాల QHD+ BOE Q10 ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, HDR, 508 ppi పిక్సల్‌ డెన్సిటీ కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను పొందుతుంది.

realme GT 8 pro smartphone sale

స్నాప్‌డ్రాగన్‌ లేటెస్ట్‌ ప్రాసెసర్‌ :
ఈ ఫోన్‌ క్వాల్‌కాం 3nm ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్ 5 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. 16GB LPDDR5x ర్యామ్‌, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. Adreno 840 GPU ను కూడా కలిగి ఉంది. 7000 sq mm తో వేపర్‌ చాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా Ricoh GR ట్యూనింగ్‌ తో ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ కెమెరా మరియు 120x డిజిటల్‌ జూమ్‌తో 200MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.

సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు ఉన్న కెమెరాలతో 60fps వద్ద 4K రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ కెమెరాలు గూగుల్‌ లెన్స్‌ ఇంటిగ్రేషన్‌ తో డ్యూయల్‌ వ్యూ వీడియో, పనోరమ, టైమ్‌ ల్యాప్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

realme GT 8 pro smartphone sale

భారీ బ్యాటరీ, వాటర్‌ రెసిస్టెంట్‌ :
ఈ ఫోన్‌లు 120W వైర్‌ SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఫోన్ 5G, బ్లూటూత్‌ 6.0, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, NFC, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్‌ సెన్సర్‌, టెంపరేచర్‌ సెన్సర్‌, ఇ-కంపాస్‌, యాక్సెలిరోమీటర్‌, గైరోస్కోప్‌, హాల్‌ సెన్సర్‌లను కలిగి ఉంది.

ధర, సేల్‌ వివరాలు :
రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72,999 గా ఉంది. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.78,999 గా ఉంది. ఈ ఫోన్ డ్రీమ్ ఎడిషన్‌ వేరియంట్‌ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంది.

రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ 25 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. అదే డ్రీమ్‌ ఎడిషన్ వేరియంట్ ను నవంబర్‌ 29 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డ్రీమ్‌ ఎడిషన్‌ పైన ఎటువంటి డిస్కౌంట్‌ లేకపోయినా, స్టాండర్డ్ వేరియంట్‌పై రూ.5000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme GT 8 pro smartphone launched in india with 200MP Camera, snapdragon 8 elite gen 5 chip
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X