15 నిమిషాల ఛార్జింగ్ చేసి రోజుంతా వాడుకొనే అవకాశం ఉన్న స్మార్ట్‌ఫోన్..!
Realme GT 8 Pro Smartphone : రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ గత నెలలో చైనాలో లాంచ్ అయింది. అయితే భారత్ లో ఈ ఫోన్ విడుదలపై తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు మరో ప్రత్యేకమైన చిప్ ను కూడా కలిగి ఉంటుంది. మరియు భారీ బ్యాటరీతో భారత్ లో విడుదల కానుంది. ఈ రియల్‌మి ఫోన్ విడుదల తేదీ, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
ఎప్పుడు విడుదల కానుంది :
భారత్ మార్కెట్ లో రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ నవంబర్ 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన మైక్రోసైట్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ ల వివరాలు వెల్లడయ్యాయి.

స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ చిప్‌సెట్ :
గతంలో వచ్చిన వివరాల ఆధారంగా రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ LPDDR5x ర్యామ్, UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు Hyper Vision+ AI చిప్ ను కూడా కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 16 OS. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. మరియు మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 7000 Sq mm వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. స్టోరేజీ వేరియంట్స్, అప్‌డేట్స్ వివరాలు తెలియాల్సి ఉంది.
15 నిమిషాల ఛార్జింగ్‌తో! :
ఈ హ్యాండ్‌సెట్ 120W అల్ట్రా ఛార్జ్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లో రోజంతా ఫోన్ పనిచేసేందుకు కావాల్సిన ఛార్జింగ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది. సింగిల్ ఫుల్ ఛార్జింగ్‌తో 21.3 గంటల యూట్యూ్బ్ వీడియో ప్లేబ్యాక్ టైం లేదా 7.66 గంటల BGMI గేమ్ ప్లే లేదా 523.2 గంటల స్టాండ్‌బై టైమ్ ను పొందవచ్చు.

7000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 2K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే ఏకంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. ముందు వైపు పంచ్ హోల్ కటౌట్ ను కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్ ను కలిగి ఉంటుంది.
IP68 రేటింగ్ :
రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. 214 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. త్వరలో ఈ ఫోన్ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








