Home
Mobile

200MP కెమెరా, 7000mAh బ్యాటరీ, QHD+ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు!

Realme GT 8 Series Smartphones : రియల్‌మి GT 8 సిరీస్ లాంచ్ అయింది. ఇందులో రియల్‌మి GT 8, రియల్‌మి GT 8 ప్రో మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ సిరీస్‌ చైనా మార్కెట్‌లోనే విడుదల అయింది. ఈ ప్రో మోడల్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ సిరీస్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

రియల్‌మి GT 8 సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రియల్‌మి GT 8, GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.79 అంగుళాల QHD+ అమోలెడ్‌ ఫ్లెక్సిబుల్‌ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ డిస్‌ప్లే 7000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ 3200Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. 508 ppi పిక్సల్‌ డెన్సిటీని కూడా కలిగి ఉంది.

Realme GT 8 series smartphones launched  here are the specifications  features

శక్తివంతమైన ప్రాసెసర్ :
రియల్‌మి GT 8 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 16GB LPDDR5x ర్యామ్, UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. అదే ప్రో మోడల్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 16GB LPDDR5x ర్యామ్, UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది.

ఆండ్రాయిడ్ 16, 7000mAh బ్యాటరీ :
ఈ రెండు మోడల్స్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. రియల్‌మి GT 8 స్మార్ట్‌ఫోన్‌ 100W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే ప్రో మోడల్‌ 120W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా రియల్‌మి GT 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇందులో GT 8 స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 30fps వద్ద 8k వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

Realme GT 8 series smartphones launched  here are the specifications  features

200MP కెమెరా :
అయితే ప్రో మోడల్‌ 22 ఫోకల్‌ లెన్త్‌తో Ricoh GR యాంటీ గ్లేర్‌ 50MP ప్రైమరీ OIS కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్ లెన్స్‌, 120x డిజిటల్‌ జూమ్‌తో 200MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా ఈ రెండు ఫోన్‌లు 5G, 4G, బ్లూటూత్‌ 6, వైఫై 7, NFC వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చారు. దీంతోపాటు ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్‌ లైట్ సెన్సర్‌, ఎలక్ట్రానిక్ కంపాస్, కలర్ టెంపరేచర్‌ సెన్సర్‌, యాక్సెలరేషన్ సెన్సర్‌, గైరోస్కోప్‌, హాల్‌ సెన్సర్‌లను కలిగి ఉంది.

రియల్‌మి GT 8 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర CNY 2899 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.36,000) గా ఉంది. ప్రో మోడల్‌ ప్రారంభ ధర CNY 3999 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.50,000) గా ఉంది. అయితే ఈ సిరీస్‌ భారత్‌ సహా గ్లోబల్ లాంచ్ పై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT 8 series smartphones launched, here are the specifications, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X