Home
Mobile

స్నా్ప్‌ డ్రాగన్ ప్రాసెసర్‌, 5500mAh బ్యాటరీతో రియల్‌మి కొత్త ఫోన్‌.. ఎప్పుడు విడుదల కానుందంటే?

రియల్‌మి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి GT నియో 6 SE విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7 సిరీస్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లను సంస్థ వెల్లడించింది.

ఈ రియల్‌మి GT నియో 6 SE స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7+ జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలిసింది. అయితే ప్రస్తుతం ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ చైనాలో మాత్రమే విడుదల అవుతుంది. అయితే భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లోకి ఎప్పుడు లాంచ్‌ కానుందనే సమాచారం వెల్లడికాలేదు. రియల్‌మి దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

Realme GT Neo 6 SE smartphone

దీంతోపాటు మరికొన్ని నివేదికల ప్రకారం ఈ రియల్‌మి GT నియో 6 SE హ్యాండ్‌సెట్‌ 1.5k LTPO OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. చైనాలో కొన్ని నివేదికల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల సహా మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

* మార్చి 19న భారత్‌ లో రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిజైన్‌ సహా కొన్ని ఫీచర్లను సంస్థ ఇప్పటికే ధ్రువీకరించింది. నార్జో 70 ప్రో 5G.. రియల్‌మి 12 ప్రో+ హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుందని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలిపింది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని పేర్కొంది. దీంతోపాటు ఈ ఫోన్ సోనీ IMX890 కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు గరిష్ఠంగా 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది.

ఈ రియల్‌మి నార్జో కొత్త ఫోన్‌ 67W సూపర్‌వోక్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంలో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ మిడ్‌ రేంజ్‌లోనే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. మరియు Air Gestures ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇది మెరుగైన అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు.

రియల్‌మి ఇండియా తమ పేజీలో రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ మార్చి 19 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ కానుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎర్లీ బర్డ్‌ సేల్‌ ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించిన ఆఫర్లను సంస్థ వెల్లడించింది. ఈ ఎర్లీ బర్డ్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసినవారు రూ.4299 వరకు ప్రయోజనాలు పొందుతారని వెల్లడించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT Neo 6 SE smartphone to feature snapdragon 7 series chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X