Home
Mobile

ఆరు గంటల 120FPS గేమింగ్, 7200mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో Realme GT7 భారత్ లో ఎంట్రీ..!

Realme GT7 India launch : రియల్‌మీ (Realme) తన కొత్త ఫోన్‌తో మార్కెట్లో సందడి చేస్తోంది. ఇటీవల చైనాలో విడుదలైన రియల్‌మీ GT7 ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీని ప్రత్యేకత ఏంటంటే, పరిశ్రమలోనే మొట్టమొదటిసారిగా ఏకంగా 6 గంటల పాటు స్థిరంగా 120FPS (ఫ్రేమ్స్ పర్ సెకండ్) గేమింగ్ అనుభవాన్ని అందిస్తామని హామీ ఇవ్వడం.

ఈ అద్భుతమైన ఫీచర్‌ను, మనందరికీ తెలిసిన బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్ సృష్టికర్త క్రాఫ్టాన్ (Krafton)తో రియల్‌మీ కుదుర్చుకున్న ప్రత్యేక భాగస్వామ్యం ద్వారా పరిచయం చేస్తున్నారు. దీనితో, స్మార్ట్‌ఫోన్లలో సుదీర్ఘమైన, ఎలాంటి ఆటంకాలు లేని గేమింగ్ సెషన్‌లకు రియల్‌మీ ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాలని చూస్తోంది.

Realme GT7 India Launch Teased

* నిజమైన గేమర్స్ కోసం తయారీ
రియల్‌మీ ప్రకారం, GT7ను గేమర్స్ కోసం అభివృద్ధి చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఫోన్ స్థిరమైన హై-ఫ్రేమ్-రేట్ గేమింగ్‌ను అందిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, 2025లో జరగబోయే బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ప్రో సిరీస్ (BMPS)కి రియల్‌మీ GT7 అధికారిక స్మార్ట్‌ఫోన్ భాగస్వామిగా కూడా వ్యవహరించింది.

ఇది గేమింగ్ పట్ల కంపెనీకి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. BGIS 2025 గ్రాండ్ ఫినాలే కోల్‌కతాలోని బిస్వా బంగ్లా మేళా ప్రాంగణంలో ఏప్రిల్ ఏప్రిల్ 27న ముగిసింది. దేశంలోని అత్యుత్తమ BGMI జట్లు ఛాంపియన్‌షిప్ కోసం తలపడ్డాయి. 2-నెలల పాటు జరిగిందీ ఈ ఈవెంట్. ఈ నేపథ్యంలో GT7 ఇండియా విడుదలపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

* పాత మోడల్ కన్నా కీలక అప్‌గ్రేడ్స్
రియల్‌మీ GT7 హార్డ్‌వేర్ విషయంలో కొన్ని పెద్ద మెరుగుదలలతో వస్తోంది. పాత GT6 లో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌కు బదులుగా, ఇందులో కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ (MediaTek Dimensity 9400+) చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఈ మార్పు వలన మెరుగైన వేగం, పనితీరు ఉంటుందని అంచనా.

* బ్యాటరీ
పాత మోడల్‌లోని 5,800mAh బ్యాటరీ ఉంది, ఇందులో 7,200mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. దీనివల్ల, గంటల తరబడి గేమ్స్ ఆడేవారికి ఎక్కువ సమయం బ్యాకప్ వస్తుంది. GT6లోని 120W కన్నా కొంచెం తక్కువగా, ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అయినా, ఇంత పెద్ద బ్యాటరీకి ఇది కూడా వేగవంతమైన ఛార్జింగే.

* డిజైన్, భద్రత, మన్నిక
చూడటానికి రియల్‌మీ GT7 మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. గ్రాఫేన్ స్నో (Graphene Snow), గ్రాఫేన్ బ్లూ (Graphene Blue), గ్రాఫేన్ నైట్ (Graphene Night). భద్రత కోసం, ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇది వేగంగా, మరింత కచ్చితత్వంతో ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది.

మన్నిక విషయానికొస్తే, GT6లో ఉన్న IP65 రేటింగ్‌కు బదులుగా, GT7 కు IP69 రేటింగ్ ఇచ్చారు. అంటే, దుమ్ము, నీటి నుంచి ఇది మరింత మెరుగైన రక్షణను అందిస్తుంది. దీనివల్ల, రోజువారీ వాడకంలో ఎదురయ్యే చిన్న చిన్న ప్రమాదాలను, కఠినమైన పరిస్థితులను తట్టుకునే శక్తి దీనికి ఎక్కువ.

* లభ్యత వివరాలు
భారతదేశంలో విడుదలైన తర్వాత, రియల్‌మీ GT7 స్మార్ట్‌ఫోన్ అమెజాన్.ఇన్ (Amazon.in), రియల్‌మీ.కామ్ (realme.com) లతో పాటు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. పవర్‌ఫుల్ గేమింగ్, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్, అదిరిపోయే మన్నికతో వస్తోంది రియల్‌మీ GT7.

ఈ ఏడాది ఇండియాలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా నిలవనుంది. అభిమానులు, గేమర్లు దీని అధికారిక ప్రకటన, ధర వివరాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme GT7 India Launch Teased 6-Hour 120FPS Gaming Beast with Dimensity 9400+ and 7200mAh Battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X