Realme Narzo 10 sale: బడ్జెట్ ధరలోని ఫోన్ మీద గొప్ప క్యాష్‌బ్యాక్ ఆఫర్స్

|

ఈ సంవత్సరం ప్రారంభంలో లాక్డౌన్ సమయంలో ఇండియాలో విడుదల అయిన రియల్‌మి నార్జో 10 స్మార్ట్ ఫోన్ కేవలం పరిమిత సమయంలోనే అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి సంస్థ యొక్క వెబ్ సైట్ ద్వారా నిర్వహించబడుతున్నాయి.

రియల్‌మి నార్జో 10 సేల్ వివరాలు

రియల్‌మి నార్జో 10 సేల్ వివరాలు

ఇండియాలో విడుదల అయినప్పటి నుండి ఫ్లాష్ అమ్మకాల ద్వారా మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చే రియల్‌మి నార్జో 10 ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 6.5-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉన్న రియల్‌మి నార్జో 10 మీడియాటెక్ హెలియో G80 SoC ద్వారా రన్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

10 వేల లోపు ధరలో 6.6-inch, 5000mAh బ్యాటరీ ఫీచర్లతో బెస్ట్ ఫోన్10 వేల లోపు ధరలో 6.6-inch, 5000mAh బ్యాటరీ ఫీచర్లతో బెస్ట్ ఫోన్

రియల్‌మి నార్జో 10 ధరల వివరాలు

రియల్‌మి నార్జో 10 ధరల వివరాలు

4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభించే రియల్‌మి నార్జో 10 స్మార్ట్‌ఫోన్ ను ‌ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి వెబ్‌సైట్‌లో కేవలం రూ.11,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది దట్ బ్లూ, దట్ గ్రీన్ మరియు దట్ వైట్ వంటి మూడు కలర్ ఎంపికలలో  కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ల విషయానికొస్తే రియల్‌మి నార్జో 10 కొనుగోలుపై రియల్‌మి సైట్ లో మోబిక్విక్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 100 శాతం సూపర్‌క్యాష్ కింద రూ.500లను వినియోగదారులకు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లోని అమ్మకపు ఆఫర్‌లలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటుగా నో-కాస్ట్ EMI పద్దతిలో నెలకు రూ.1,334 పద్దతిలో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి నార్జో 10 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 10 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి 10 ఫోన్ 6.5-అంగుళాల హెచ్‌డి + రిజల్యూషన్ డిస్ప్లేను 720x1600 పిక్సెల్స్ పరిమాణం మరియు 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఇది స్పోర్ట్స్ మీడియాటెక్ హెలియో G70 SoC తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10-ఆధారిత రియల్‌మి UI తో పనిచేస్తుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే 4G ఎల్‌టిఇ, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్ల విషయానికి వస్తే ఇది యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి.

రియల్‌మి నార్జో 10 స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్

రియల్‌మి నార్జో 10 స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్

రియల్‌మి 10 స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f / 1.8 ఎపర్చర్‌ లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంది. ఇది 119 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో వస్తుంది. కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌ లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ సెల్ఫీ కెమెరా 30fps ఫ్రేమ్ రేట్ వద్ద HD (720p) వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. వెనుక కెమెరా సెటప్ ఫుల్ -హెచ్‌డి (1080p) వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Realme Narzo 10 Flash Sale Live on Flipkart and Realme Website

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X