Realme Narzo 20 సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ధరలో లాంచ్!! ఫీచర్స్ అదుర్స్...

|

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లో రోజు రోజుకి పోటీ ఎక్కువ అవుతున్నది. ముఖ్యంగా రియల్‌మి మరియు షియోమి సంస్థల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకున్నది. గత నెలలో షియోమి బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇప్పుడు రియల్‌మి సంస్థ వాటికీ పోటీగా రియల్‌మి నార్జో 20 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి‌.కామ్ ద్వారా అమ్మకానికి త్వరలోనే ముందుకు రానున్నాయి. తాజా రియల్‌మి నార్జో 20 సిరీస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి నార్జో 20 సిరీస్ ధరల వివరాలు

రియల్‌మి నార్జో 20 సిరీస్ ధరల వివరాలు

ఇండియాలో  రియల్‌మి నార్జో 20 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్ లలో విడుదల చేసారు. ఇందులో 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.10,499 కాగా  6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ యొక్క ధర రూ.11,499.  దీని యొక్క మొదటి అమ్మకాలు ఇండియాలో సెప్టెంబర్ 28 న మధ్యాహ్నం 12:00 గంటల నుండి ప్రారంభంకానున్నది.

రియల్‌మి నార్జో 20A ధరల వివరాలు

రియల్‌మి నార్జో 20A ధరల వివరాలు

రియల్‌మి నార్జో 20 సిరీస్ లో  నార్జో 20A ను కూడా రెండు వేరియంట్ లలో విడుదల చేసారు. ఇందులో రూ.8,499 బడ్జెట్ ధర వద్ద 3GB RAM + 32GB స్టోరేజ్ మోడల్ మరియు రూ.9,499 ధర వద్ద 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్‌ను కంపెనీ విక్రయించనుంది. వీటి యొక్క మొదటి అమ్మకాలు సెప్టెంబర్ 30 నుండి ప్రారంభంకానున్నాయి.

రియల్‌మి నార్జో 20 ప్రో ధరల వివరాలు

రియల్‌మి నార్జో 20 ప్రో ధరల వివరాలు

రియల్‌మి నార్జో 20 సిరీస్ లో చివరిది రియల్‌మి నార్జో 20 ప్రో ను కూడా ఇండియాలో రెండు వేరు వేరు వేరియంట్ లలో విడుదల చేసారు.  ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ రూ.14,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ను రూ.16,999 ధర వద్ద పొందవచ్చు. దీని యొక్క మొదటి అమ్మకం సెప్టెంబర్ 25 నుండి ప్రారంభంకానున్నాయి.

రియల్‌మి నార్జో 20A మరియు నార్జో 20 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 20A మరియు నార్జో 20 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 20, 20A స్మార్ట్‌ఫోన్‌లు రెండూ కూడా 6.5-అంగుళాల డిస్ప్లేను  LCD స్క్రీన్‌తో హెచ్‌డి + రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ మరియు 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఫీచర్లతో అందిస్తుంది. నార్జో 20A వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో 2 మెగాపిక్సెల్ B&W  లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో పాటు 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ క్వాల్‌కామ్ యొక్క మిడ్-రేంజ్ 11nm చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 625 SOC తో రన్ అవుతుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరిని మరింత విస్తరించవచ్చు. ఇది 5,000mAh అతి పెద్ద బ్యాటరీని స్టాండర్డ్ 10W పాస్ట్ ఛార్జర్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది.

రియల్‌మి నార్జో 20 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ హెలియో G85 SoC ఫీచర్స్

రియల్‌మి నార్జో 20 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ హెలియో G85 SoC ఫీచర్స్

రియల్‌మి నార్జో 20 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.5-అంగుళాల డిస్ప్లేను LCD స్క్రీన్ మరియు HD + రిజల్యూషన్‌తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను పంచ్ హోల్ డిస్ప్లేలో అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 119-డిగ్రీల అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో కలిపి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G85 SoC తో రన్ అవుతుంది. ఇది 18-వాట్ ఫాస్ట్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

రియల్‌మి నార్జో 20 ప్రో 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

రియల్‌మి నార్జో 20 ప్రో 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

రియల్‌మి నార్జో 20 సిరీస్ లో అత్యధిక మోడల్‌ బేస్ గల రియల్‌మి నార్జో 20 ప్రో ఫుల్-HD + రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది.  ఇది 480 నిట్స్ ప్రకాశం మరియు 90.5 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో కలిగి ఉంది. ఇది పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉండి ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ 119-డిగ్రీల అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ B&W పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది  65W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కేవలం 38 నిమిషాల్లో 0 నుండి 100 శాతం వరకు హ్యాండ్‌సెట్‌ను ఛార్జ్ చేస్తుంది అని కంపెనీ పేర్కొంది. 

Best Mobiles in India

Read more about:
English summary
Realme Narzo 20, Narzo 20A, Narzo 20 Pro Released in India: Price, Specs, Sale date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X