ధర రూ.20000 కంటే తక్కువ ధరలో కర్వడ్ డిస్‌ప్లేతో రియల్‌మి కొత్త ఫోన్.. లాంచ్ వివరాలు లీక్..!
భారత్ మార్కెట్‌లో రియల్‌మి ఇటీవల వివధ రకాల స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. దీంతోపాటు నార్జో 70 సిరీస్‌ను కూడా క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక మోడళ్ల నార్జ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలో రియల్‌మి నార్జో 70 కర్వ్ పేరుతో (Realme Narzo 70 Curve Smartphone) మరో హ్యాండ్‌సెట్ లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సంబంధించిన లాంచ్ సహా కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.
రియల్‌మి నార్జో 70 కర్వ్ డిస్‌ప్లే, ధర వివరాలు :
రియల్‌మి నార్జో 70 సిరీస్‌లో ఐదో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌గా ఈ నార్జో కర్వ్ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. భారత్ మార్కెట్‌లో కర్వ్ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ ఆఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది. 91మొబైల్స్ నివేదిక ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.15,000 నుంచి రూ.20,000 గా ఉంది.

రియల్‌మి నార్జో 70 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు :
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో రియల్‌మి నార్జో 70, నార్జో 70 ప్రో, నార్జో 70 టర్బో, నార్జో 70x ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ హ్యాండ్‌సెట్‌ల చిప్‌సెట్, బ్యాటరీ, కెమెరా, ధరల వివరాల ఆధారంగా త్వరలో విడుదల కానున్న రియల్‌మి నార్జో 70 కర్వ్ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లను అంచనా వేయవచ్చు.
భారత్ మార్కెట్‌లో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన రియల్‌మి నార్జ్ 70 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌లను కలిగి ఉన్నాయి. నార్జో 70 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5G SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. నార్జో 70X స్మార్ట్‌ఫోన్.. మీడియాటెక్ 6100+ SoC, నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్, నార్జో 70 టర్బో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తున్నాయి.
నార్జో 70 సిరీస్ ఫోన్‌ల మధ్య డిజైన్ సహా ఫీచర్‌లలో కొన్ని పోలికలున్నాయి. రియల్‌మి నార్జో 70, నార్జో 70 ప్రో, నార్జో 70 టర్బో హ్యాండ్‌సెట్‌లు 6.67 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులో ఉన్నాయి. మరియు 16MP సెల్పీ కెమెరాను కలిగి ఉన్నాయి. అదే నార్జో 70x హ్యాండ్‌సెట్ 6.72 అందుళాల డిస్‌ప్లే, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా, బ్యాటరీ పరంగా ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉన్నాయి.
రియల్‌మి నార్జో 70 సిరీస్ ధరలు :
ఈ సిరీస్ మోడళ్ల ప్రారంభ ధర రూ.20,000 కంటే తక్కువగా ఉంది. నార్జో 70 ఫోన్ ప్రారంభ ధర రూ.14999, అదే నార్జో 70 టర్బో ధర రూ.16999 గా ఉంది. అదే నార్జో 70 ప్రో హ్యాండ్‌సెట్ ధర రూ.18999 గా ఉంది. దీంతోపాటు నార్జో 70x స్మార్ట్‌ఫోన్ ధర రూ.10999 గా ఉంది.
డిసెంబర్ నెలాఖరులో భారత్‌లో విడుదల కానుందని భావిస్తున్న రియల్‌మి నార్జో 70 కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు రూ.15,000- రూ.20,000 మధ్య ధరలో అందుబాటులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఫోన్ డిజైన్ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications