రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎర్లీ బర్డ్ సేల్.. రూ.4,299 వరకు ప్రయోజనాలు.. లాంచ్, స్పెసిఫికేషన్లు
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 70 Pro 5G) భారత్ మార్కెట్‌లో మార్చి 19న లాంచ్ కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ సహా కొన్ని ఫీచర్లను సంస్థ ఇప్పటికే ధ్రువీకరించింది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు సహా ఇతర వివరాలు లీక్ అయ్యాయి. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ కు సంబంధించిన వివరాలను సంస్థ విడుదల చేసింది.
రియల్‌మి ఇండియా తమ పేజీలో రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 19 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎర్లీ బర్డ్ సేల్ (Realme Narzo 70 Pro 5G Early Bird Sale) ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించిన ఆఫర్లను సంస్థ వెల్లడించింది.

ఈ ఎర్లీ బర్డ్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసినవారు రూ.4,299 వరకు ప్రయోజనాలు పొందుతారని వెల్లడించింది. అయితే విడుదల సమయంలో మిగిలిన వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. కొందరు కొనుగోలుదారులు రూ.2,299 విలువైన డోమ్ గ్రీన్ కలర్ రియల్‌మి బడ్స్ T300ను పొందవచ్చు. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ డుయో టచ్ గ్లాస్ డిజైన్ మరియు వృత్తాకార కెమెరా మాడ్యుల్ ను కలిగి ఉంటుంది. ఈ అమెజాన్ ల్యాండింగ్ పేజీ ద్వారా కొన్ని ఫీచర్ల సమాచారం అందుబాటులోకి వచ్చింది.

రియల్‌మి సంస్థ నార్జో 70 ప్రో స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను ధ్రువీకరించింది. ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలిపింది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని పేర్కొంది. దీంతోపాటు ఈ ఫోన్ సోనీ IMX890 కెమెరాను కలిగి ఉంటుందని తెలిపింది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 12 ప్రో+ హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుందని తెలుస్తోంది.

ఈ రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు గరిష్ఠంగా 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది.
ఈ రియల్‌మి నార్జో కొత్త ఫోన్ 67W సూపర్‌వోక్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంలో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ మిడ్ రేంజ్‌లోనే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. మరియు Air Gestures ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇది మెరుగైన అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








