8GB ర్యామ్, 50MP కెమెరా రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్ నుంచి మార్చిలో నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 70 Pro 5G Smartphone) లాంచ్ అయింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల ధరతో పోలిస్తే 20 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపునకే సొంతం చేసుకోవచ్చు. నో EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఈ రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు గ్లాస్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. 50MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. మరియ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400*1080 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్, 2200Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులో ఉంది. హారిజన్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్‌తో అందుబాటులో ఉంది.
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.1 పైన పనిచేస్తుంది. మరియు ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటి 7050 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ Mali G68 చిప్‌సెట్‌తో జతచేయబడింది. 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని సంస్థ హామీ ఇచ్చింది.
ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఛార్జింగ్ పరంగా 67W వైర్ SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 11 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తి చేయవచ్చని సంస్థ హామీ ఇచ్చింది.
కనెక్టివిటీ పరంగా రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 5G, వైఫై, బ్లూటూత్ 5.2 మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే స్కానర్‌ను కలిగి ఉంటుంది. గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్ రంగుల్లో ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. అమెజాన్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








