Home
Mobile

6.67 అంగుళాల డిస్‌ప్లే, 256GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్‌.. ఏప్రిల్‌ 14 వరకు అవకాశం..!

రియల్‌మి నుంచి గత నెల రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 70 Pro 5G Smartphone) విడుదల అయింది. తొలి సేల్‌ కూడా గత నెలలోనే అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌పై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌ మరియు అమెజాన్‌లో ఉంది.

బ్యాంకు ఆఫర్లు :
ఇందుకోసం రియల్‌మి ఓ బ్యాంక్‌ ఆఫర్‌ను (Realme Narzo 70 Pro 5G Discount Offer) ప్రకటించింది. బ్యాంకు డెబిట్‌ మరియు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్‌ వర్తించనుంది. 8GB ర్యామ్‌ +128GB వేరియంట్‌పైన రూ.2000 ను పొందవచ్చు. ఫలితంగా రూ.17999 బేస్‌ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo 70 Pro 5G Smartphone attracts with RS3000 discount

గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్ :
అదే 8GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.21999 గా ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.3000 తగ్గింపును పొందనుంది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.18999 కే కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌ ఆధారంగా ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.

6.67 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లే :
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌తో కూడిన 6.67 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ సహా 2200Hz వరకు టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. గ్లాస్‌ డిజైన్, ఎయిర్‌ గెశ్చర్ వంటి ప్రత్యేక ఫీచర్లతో లాంచ్‌ అయింది.

ఆండ్రాయిడ్ 14 రియల్‌మి UI 5.1 :
ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటి 7050 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ Mail G68 GPU తో జతచేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.1 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు మరియు రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

ఈ రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP 1/1.56 అంగుళాల సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, f/1.88 అపేచర్‌ సహా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. మరియు f/2.2 అపేచర్‌తో 8MP అల్టావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు f/2.4 అపేచర్‌తో 16MP Hynix Hi1634Q సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

67W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌ :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 67W వైరడ్‌ SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5G, వైఫై, బ్లూటూత్‌ 5.2 మరియు USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. ఇన్‌ డిస్‌ప్లే స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 195 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 70 Pro 5G Smartphone gets RS 3000 discount in india 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X