50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 తగ్గింపు.. పూర్తి వివరాలు..
రియల్‌మి నుంచి ఈ సంవత్సరం మార్చి నెలలో రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 70 Pro 5G Smartphone) లాంచ్ అయింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.19,999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.17,998 గా ఉంది. అయితే కూపన్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ ధరపై గరిష్ఠంగా రూ.2500 తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 67W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 6.67 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,998 గా ఉంది. ఈ వేరియంట్‌పై కూపన్ ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌పై రూ.2500 వరకు కూపన్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్ EMI ఆప్షన్‌లను కూడా వినియోగించుకోవచ్చు.

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400*1080 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ సహా 2200Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. గ్లాస్ డిజైన్ సహా ఎయిర్ గెశ్చర్ వంటి ప్రత్యేక ఫీచర్లతో లాంచ్ అయింది.
రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.88 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. f/2.2 అపేచర్‌తో 8MP అల్టావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.1 పైన పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ Mail G68 GPU తో జతచేయబడి ఉంది. రెండు ఆండ్రాయిడ్ అప్డేట్లు, మూడు సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు రియల్ మి తెలిపింది.
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 67W వైర్ SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్మార్ట్్ఫోన్ 5G, వైఫై, బ్లూటూత్ 5.2 మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే సెన్సార్్ను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








