50MP కెమెరా, గ్లాస్ డిజైన్‌తో రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్ తేదీ, సేల్ వివరాలు..!
రియల్‌మి తన నార్జో సిరీస్ ఫోర్ట్‌ఫోలియోను క్రమంగా భారత్‌లో విస్తరిస్తోంది. ఇందులో భాగంగా రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ( Realme Narzo 70 Pro 5G Smartphone Launch Date ) ను మార్చి 19న లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉందని సంస్థ వెల్లడించింది. తక్కువ వెలుగులోనూ నాణ్యమైన ఫోటోలు క్యాప్చర్ చేయవచ్చని తెలిపింది.
రియల్‌మి నార్జో 70 ప్రో స్పెసిఫికేషన్లు :
రియల్‌మి సంస్థ నార్జో 70 ప్రో స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను ధ్రువీకరించింది. ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలిపింది. OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని పేర్కొంది. దీంతోపాటు ఈ ఫోన్ సోనీ IMX890 కెమెరాను కలిగి ఉంటుందని తెలిపింది.

అయితే ఈ రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్ ఫోన్.. రియల్‌మి 12 ప్రో+ హ్యాండ్ సెట్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డుయో టచ్ గ్లాస్ డిజైన్‌తో వస్తుందని పేర్కొంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS : ఈ రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు గరిష్ఠంగా 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది.

ఈ రియల్‌మి నార్జో కొత్త ఫోన్ 67W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంలో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ మిడ్ రేంజ్‌లోనే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. మరియు Air Gestures ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇది మెరుగైన అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు.
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ సహా ఇతర రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. భారత్ మార్కెట్‌లో మార్చి 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మిడ్ రేంజ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఈ ఫోన్‌ను విడుదల చేస్తున్నారు. అయితే విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ఫోన్ మిగిలిన స్పెసిఫికేషన్ల వివరాలు వెలువడే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








