Home
Mobile

8GB ర్యామ్‌, ట్రిపుల్‌ కెమెరా, 6.67 అంగుళాల డిస్‌ప్లేతో Realme స్మార్ట్‌ఫోన్‌ విడుదల..తొలిసారిగా ఈ ఫీచర్లతో!

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ తాజాగా భారత్‌ మార్కెట్‌లోకి (Realme Narzo 70 Pro 5G Smartphone launched) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ రెయిన్ వాటర్ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. మరియు హారిజన్‌ గ్లాస్‌ డిజైన్‌ సహా డ్యూయల్ టోన్‌ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు అమోలెడ్‌ డిస్‌ప్లే సహా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది.

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్పెసిఫికేషన్లు ;
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌తో కూడిన 6.67 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ సహా 2200Hz వరకు టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో లాంచ్‌ అయింది.

Realme Narzo 70 Pro 5G smartphone launched

ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డెమెన్సిటి 7050 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ Mail G68 GPU తో జతచేయబడి ఉంటుంది. మరియు 8GB ర్యామ్‌, 256GB గరిష్ఠ అంతర్గత స్టోరేజీను కలిగి ఉంటుంది. 16GB వరకు ర్యా్‌మ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది.

ఈ రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.1 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు మరియు రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సంస్థ హామీ ఇచ్చింది. 8GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

Realme Narzo 70 Pro 5G smartphone launched

ఈ రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP 1/1.56 అంగుళాల సోనీ IMX890 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. f/1.88 అపేచర్‌ సహా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. మరియు f/2.2 అపేచర్‌తో 8MP అల్టావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు f/2.4 అపేచర్‌తో 16MP Hynix Hi1634Q సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 67W వైరడ్‌ SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5G, వైఫై, బ్లూటూత్‌ 5.2 మరియు USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. ఇన్‌ డిస్‌ప్లే స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 195 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Realme Narzo 70 Pro 5G smartphone launched

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌+128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.18,999 గా ఉంది. 8GB ర్యామ్+256GB అంతర్గత స్టోరేజీ రూ.19,999 గా ఉంది. ఈ ఫోన్ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. మార్చి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.2299 విలువైన రియల్‌మి T300 TWS ఇయర్‌ఫోన్లను పొందవచ్చు.

అయితే అధికారిక సేల్‌ కంటే ముందే ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎర్లీ బర్డ్ సేల్ (Realme Early Bird Sale) పేరుతో ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.4299 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. HDFC, ICICI కార్డుల ద్వారా రూ.2000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Realme Narzo 70 Pro 5G smartphone launched

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 70 Pro 5G smartphone launched in india specs and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X