Home
Mobile

50MP కెమెరా, 128GB స్టోరేజీ రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేక సేల్‌.. రూ.3000 తగ్గింపు..!

రియల్‌మి సంస్థ మార్చి నెలలో భారత్‌లో రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మా్ర్ట్‌ఫోన్‌ను (Realme Narzo 70 Pro 5G) విడుదల చేసింది. ఇప్పటికే కొనుగోలుకు అందుబాటులో ఉంది. రియల్‌మి సేవింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.3000 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆఫర్‌ ఇవాళ (జూన్‌ 6) అర్ధరాత్రి 12 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. మరియు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.19,999 కాగా రియల్‌మి సేవింగ్ డేస్‌ సేల్‌లో భాగంగా రూ.16,999కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21,999 గా ఉంది. కూపన్‌ ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు.

Realme narzo 70 Pro 5G smartphone received rs3000

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్, 2200Hz వరకు టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.1 OS ను కలిగి ఉంది. మరియు ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటి 7050 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. Mail G68 GPU తో జతచేయబడి ఉంటుంది. మూడు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు మరియు రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని రియల్‌మి హామీ ఇచ్చింది.

రియల్‌మి నార్జో 70 ప్రో 5G ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టు, f/1.88 అపేచర్‌తో 50MP 1/1.56 అంగుళాల సోనీ IMX890 ప్రధాన కెమెరాను కలిగి ఉంది. f/2.2 అపేచర్‌తో 8MP అల్టావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. ముందువైపు f/2.4 అపేచర్‌తో 16MP Hynix Hi1634Q సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 67W SuperVOOC వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్లాస్‌ డిజైన్ సహా ఎయిర్‌ గెశ్చర్ ఫీచర్‌లతో అందుబాటులో ఉంది. భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే స్కానర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌ 5.2, వైఫై, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Realme narzo 70 Pro 5G smartphone limited period offer in india 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X