Home
Mobile

8GB ర్యామ్‌, 50MP సోనీ కెమెరా రియల్‌మి స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై ధర తగ్గింపు..!

రియల్‌మి నార్జో 70 ప్రో 70 5G (Realme Narzo 70 Pro 5G Smartphone Sale) ఇటీవల భారత్‌లో విడుదల అయింది. మార్చి 19న ఎర్లి బర్డ్‌ సేల్‌ పేరుతో లిమిటెడ్‌ సేల్‌ అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి అధికారికంగా నుంచి కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ సహా ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.19,999 మరియు 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్లాస్ గ్రీన్‌ మరియు గ్లాస్‌ గోల్డ్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. HDFC, ICICI కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే తగ్గింపు ధరను పొందవచ్చు.

Realme Narzo 70 Pro 5G Smartphone Sale

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌పై రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.2299 విలువైన రియల్‌మి బడ్స్‌ T300 ను పొందవచ్చు.

రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్పెసిఫికేషన్లు..
రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌తో కూడిన 6.67 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ సహా 2200Hz వరకు టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో లాంచ్‌ అయింది. గ్లాస్‌ డిజైన్ సహా ఎయిర్‌ గెశ్చర్లతో ఈ ఫోన్‌ విడుదల అయింది.

ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటి 7050 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ Mail G68 GPU తో జతచేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.1 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు మరియు రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

ఈ రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP 1/1.56 అంగుళాల సోనీ IMX890 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. f/1.88 అపేచర్‌ సహా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. మరియు f/2.2 అపేచర్‌తో 8MP అల్టావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు f/2.4 అపేచర్‌తో 16MP Hynix Hi1634Q సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ 67W వైరడ్‌ SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5G, వైఫై, బ్లూటూత్‌ 5.2 మరియు USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. ఇన్‌ డిస్‌ప్లే స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 195 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 70 Pro 5G Smartphone Sale is live now on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X