Home
Mobile

50MP సోనీ కెమెరా, 256GB స్టోరేజీతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌.. ప్రత్యేక ఫీచర్లతో రేపే లాంచ్‌..!

రియల్‌మి సంస్థ భారత్‌ మార్కెట్‌లోకి మార్చి 19న రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను (Realme Narzo 70 Pro 5G smartphone Launch) లాంచ్‌ చేయనుంది. అయితే అధికారిక విడుదలకు ముందే ఈ హ్యాండ్‌సెట్‌ కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్ల సమాచారం వెల్లడించింది. ఇందులో డిస్‌ప్లే, ఛార్జింగ్‌, స్టోరేజీ, కెమెరాల వివరాలున్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆధారంగా ఈ నార్జో 70 ప్రో హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు హారిజన్ గ్లాస్‌ రక్షణ కలిగి ఉంటుంది. మరియు రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Realme Narzo 70 Pro 5G Smartphone sale Via amazon) ద్వారా అందుబాటులోకి రానుంది.

Realme Narzo 70 Pro 5G smartphone

దీంతోపాటు ఎర్లీ బర్డ్‌ సేల్‌ రేపు సాయంత్రం 6 గంటలకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఎర్లీ బర్డ్‌ సేల్‌లో భాగంగా రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు రూ.4,299 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో భాగంగా రూ.2,299 విలువైన బడ్స్‌ T300 ను ఉచితంగా పొందవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లను సంస్థ ధ్రువీకరించింది. రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే గరిష్టంగా 2000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు తొలిసారిగా హారిజన్‌ గ్లాస్‌ డిజైన్‌తో వస్తుంది. రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌, Air Gestures వంటి ఆకట్టుకొనే ఫీచర్లను కలిగి ఉంటుంది.

Realme Narzo 70 Pro 5G smartphone

ఈ రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP సోనీ IMX890 కెమెరా, 67W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్టు, 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ మరిన్ని వివరాలు విడుదల రోజుల వెల్లడికానున్నాయి.

అయితే ఈ రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 12 ప్రో+ హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుందని తెలుస్తోంది. 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని తెలుస్తోంది. 67W సూపర్‌వోక్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంలో వస్తుందని తెలుస్తోంది.

ఈ రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు గరిష్ఠంగా 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 70 Pro 5G smartphone to launch on march 19 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X