Home
Mobile

తొలిసారిగా గ్లాస్‌ డిజైన్‌, సోనీ కెమెరాలు సహా కీలక ఫీచర్లతో రియల్‌మి కొత్తఫోన్‌.. లాంచ్‌, స్పెసిఫికేషన్లు..!

రియల్‌మి సంస్థ త్వరలో నార్జో 70 సిరీస్‌ ఫోన్లను (Realme Narzo 70 Pro Smartphone) విడుదల చేయనుంది. ఈ సిరీస్‌ ఫోన్లు అందుబాటులోకి ధరలోనే ఉండనున్నాయని తెలుస్తోంది. గత సంవత్సరం నార్జో 60 మరియు నార్జో 60 ప్రో హ్యాండ్‌సెట్లను విడుదల చేసింది. అయితే ఈ రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు గ్లాస్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈ నెలలోనే విడుదల! : ఈ రియల్‌మి నార్జో 70 ప్రో హ్యాండ్‌సెట్‌ ఈనెలలోనే (Realme Narzo 70 Pro Launch date) విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌ వివరాలు ఇటీవలే కొన్ని అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మి ఇండియా ల్యాండింగ్‌ పేజీలో ఈ కొత్త హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన గ్లింప్స్‌ విడుదల అయింది.

Realme Narzo 70 Pro launch date

తొలిసారిగా గ్లాస్‌ డిజైన్‌ : ఈ గ్లింప్స్‌ ఆధారంగా ఈ రియల్‌మి నార్జో 70 డీప్‌ గ్రీన్‌ కలర్‌లో కనిపించింది. మరియు వెనుకవైపు గ్లాస్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌తో గ్లాస్‌ డిజైన్‌ను కలిగి ఉన్న తొలిఫోన్‌ ఇదేనని రియల్‌మి చెబుతోంది.

మరియు ఈ గ్లింప్స్‌ ఆధారంగా ఈ ఫోన్‌ వృత్తాకార కెమెరా గ్లాస్‌ మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది హ్యాండ్‌సెట్‌కు డ్యూయల్‌ టోన్‌ ఎఫెక్ట్‌ను ఇస్తోంది. రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ తన పాత తరం మోడల్‌ 60 ప్రో కంటే చాలా భిన్నంగా ఉంది.

Realme Narzo 70 Pro launch date

రియల్‌మి నార్జో 70 ప్రో స్పెసిఫికేషన్లు :
రియల్‌మి నార్జో 70 ప్రో హ్యాండ్‌సెట్‌ ఫ్లాట్‌ స్క్రీన్‌ డిజైన్‌తో స్లిమ్ బెజెల్స్‌ మరియు ముందువైపు పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు మెరుగైన కెమెరా ఫీచర్లను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సోనీ IMX890 కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) ఫీచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు మెరుగైన పనితీరు కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కొన్ని నివేదికల ఆధారంగా ఈ రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS సహా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7S జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సమాచారం. దీంతోపాటు ఈ ఫోన్ Air Gestures ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇది మెరుగైన అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 70 Pro Smartphone may launch in march 2024 with glass design in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X