Home
Mobile

రిపబ్లిక్‌ డే సేల్‌ 2025.. ఈ 5G గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.2500 డిస్కౌంట్‌..!

రిపబ్లిక్‌ డే సేల్‌ సందర్భంగా రియల్‌మి ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరలకు రియల్‌మి హ్యాండ్‌సెట్‌లు సహా ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా రూ.10,000 డిస్కౌంట్‌ను పొందవచ్చని రియల్‌మి చెబుతోంది. ఈ రియల్‌మి ప్రత్యేక సేల్‌లో (Realme Republic Day Sale 2025)భాగంగా రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme Narzo 70 Turbo 5G Smartphone) ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్లో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తోంది.

Realme narzo 70 turbo 5G smartphone price drop 2025

రియల్‌మి రిపబ్లిక్‌ డే సేల్‌లో ఈ 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.16,998 గా ఉంది. అదే 8GB ర్యామ్ ధర రూ.17998, 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.20,998 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్ ధర ఏకంగా రూ.2,500 తగ్గింపును పొందవచ్చు. టర్బో గ్రీన్‌, టర్బో యెల్లో, టర్బో పర్పుల్‌ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
నార్జో 70 టర్బో 5G హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా గేమింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుందని రియల్‌మి తెలిపింది. 7.6mm స్లిమ్‌ డిజైన్‌తో అందుబాటులో ఉంది. రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్, AI ఐ ప్రొటెక్షన్‌ ను సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌, AI బూస్ట్‌ ఇంజిన్‌ 2.0 ను కలిగి ఉంది. ఫలితంగా గేమింగ్ సమయంలో అనుకూలంగా ఉంటుందని రియల్‌మి చెబుతోంది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా రియల్‌మి నార్జో 70 టర్బో 5G హ్యాండ్‌సెట్ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP పొర్ట్రెయిట్‌ కెమెరాలను అమర్చి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. మరియు 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 5G, WiFi, బ్లూటూత్‌ 5.4, USB- C వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ ను అమర్చారు. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌తో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme narzo 70 turbo 5G smartphone gets RS2500 coupon discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X