Home
Mobile

రియల్‌మి నార్జో టర్బో 70 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లోకి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme Narzo 70 Turbo 5G) త్వరలో విడుదల కానుంది. రియల్‌మి నార్జో 70 సిరీస్‌ విస్తరణలో భాగంగా మరో ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ టీజర్‌ను సంస్థ విడుదల చేయగా.. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ, డిజైన్‌ సహా ఇతర వివరాలు వెల్లడించింది. వీటితోపాటు ఈ రియల్‌మి నార్జో టర్బో 70 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్‌లు, ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లు వివరాలు వెల్లడయ్యాయి.

అమెజాన్‌ ద్వారా సేల్‌ :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ 9 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ ప్రేరేపిత డిజైన్‌ను కలిగి ఉంటుంది. తాజాగా సంస్థ విడుదల చేసిన ఫోటో ద్వారా అనేక విషయాలు వెల్లడయ్యాయి. ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ద్వారా సేల్‌ నిర్వహించనున్నారు.

Realme Narzo 70 Turbo 5G smartphone

ఇప్పటికి వరకు తెలిసిన వివరాలు ప్రకారం ఈ రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 7.6mm థిక్‌నెస్‌, 185 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. నార్జో 70 5G స్మార్ట్‌ఫోన్‌ పవర్‌, వాల్యూమ్‌ బటన్‌ కుడి వైపున ఉంది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ పైన స్పీకర్‌ గ్రిల్‌, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది.

రియల్‌మి నార్జో 70 టర్బో 5G లీకైన వివరాలు :
లీకైన వివరాల ఆధారంగా ఈ రియల్‌మి కొత్త ఫోన్‌ నాలుగు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 6GB ర్యామ్‌ +128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుందని తెలుస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే మిలిగిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు తెలియాల్సి ఉంది. స్టోరేజీ, కెమెరా వివరాలపై రియల్‌మి ఎటువంటి ప్రకటన చేయలేదు.

* రియల్‌మి నుంచి ఇటీవలే భారత్‌ మార్కెట్లో రియల్‌మి 13 ప్రో సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా రియల్‌మి 13 ప్రో ప్లస్‌ మోనెట్‌ పర్పుల్‌ కలర్‌ వేరియంట్ లాంచ్‌ అయింది. ఇవాళ్టి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్ ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.32999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Realme Narzo 70 5G smartphone launch date announced in india specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X