ధర రూ.14999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్.. సేల్ ప్రారంభం..!
రియల్‌మి నుంచి ఇటీవల నార్జో సిరీస్ కొత్త హ్యాండ్‌సెట్ లాంచ్ అయింది. ఈ రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ సేల్ (Realme Narzo 70 Turbo 5G Smartphone Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. కూపన్ ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.14999 గా ఉంటుంది. 5000mAh బ్యాటరీ సహా 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

ఈ టర్బో 5G హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్, Mali G615 GPU, 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. వర్చువల్‌గా ద్వారా 26GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంది.
50MP AI ప్రధాన కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ 50MP AI ఆధారిత కెమెరా, 2MP పొర్ట్రెయిట్ కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ 16MP కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 5G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, Glonass, Beidou, Qzss, Galileo, USB- C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. గైరో మీటర్, మాగ్నటిక్ ఇండక్షన్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలిరేషన్ సెన్సార్లను కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 30 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ కానుందని రియల్‌మి చెబుతోంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్‌ను రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు (Realme Narzo 70 Turbo 5G Sale) చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా కూపన్ ద్వారా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ప్రారంభ ధర రూ.14999 గా ఉంటుంది. ఈ టర్బో హ్యాండ్‌సెట్ టర్బో యెల్లో, టర్బో గ్రీన్, టర్బో పర్పుల్ వంటి మూడు రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








