Home
Mobile

ధర రూ.12000 కంటే తక్కువ ధరకే 45W ఛార్జింగ్‌ సపోర్టుతో రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌ వివరాలు..!

రియల్‌మి సంస్థ భారత్‌ మార్కెట్‌లో తన ఫోర్ట్‌ఫోలియో విస్తరణపై ఎక్కువ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. కొన్నిరోజుల క్రితం రియల్‌మి P1 5G సిరీస్‌ను లాంచ్‌ చేసిన సంస్థ తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.

రియల్‌మి అధికారిక X పోస్ట్ ఆధారంగా ఏప్రిల్‌ 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్‌ఫోన్‌ను (Realme Narzo 70X 5G Smartphone) లాంచ్‌ చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 45W ఛార్జింగ్‌ సపోర్టుతో రూ.12000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తామని రియల్‌మి వెల్లడించింది.

Realme Narzo 70X 5G Smartphone confirmed to launch on april 24 in india

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల విడుదలైన నార్జో 70 ప్రో తరహా ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌తో కూడిన 6.67 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ సహా 2200Hz వరకు టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. గ్లాస్‌ డిజైన్ సహా ఎయిర్‌ గెశ్చర్ వంటి ప్రత్యేక ఫీచర్లతో లాంచ్‌ అయింది. 67W వైరడ్‌ SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటి 7050 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ Mail G68 GPU తో జతచేయబడి లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.1 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు మరియు రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

ఈ నార్జో 70 ప్రో వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP 1/1.56 అంగుళాల సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, f/1.88 అపేచర్‌ సహా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. మరియు f/2.2 అపేచర్‌తో 8MP అల్టావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు f/2.4 అపేచర్‌తో 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.17999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.21999 గా ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 5G, వైఫై, బ్లూటూత్‌ 5.2 మరియు USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. ఇన్‌ డిస్‌ప్లే స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 195 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 70X 5G Smartphone confirmed to launch on april 24 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X