50MP కెమెరా, 6.72 అంగుళాల డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల.. ధర రూ.12999..!
రియల్‌మి నుంచి నార్జో 70X 5G స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో భారత్‌లో విడుదల అయింది. అప్పట్లో 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ మరియు 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ హ్యాండ్ సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ (Realme Narzo 70x 5G Smartphone New Variant) విడుదల అయింది. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ రియల్‌మి అధికారిక వెబ్ సైట్ మరియు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ ధర :
రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. అయితే అమెజాన్‌లో కొనుగోలు సమయంలో రూ.2000 తగ్గింపు కూపన్‌ను అందిస్తోంది. ఫలితంగా రూ.12,999 కే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఐస్ బ్లూ మరియు ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్ ఫోన్ 6.72 పుల్ HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్ సెట్ ఆకట్టుకొనే డిజైన్ ను కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS :
ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC చిప్ సెట్ పైన పనిచేస్తుంది. 8GB ర్యామ్ LPDDR4X ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంటుంది.

రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఛార్జింగ్ స్పీడ్‌తో కేవలం 30 నిమిషాల్లో 1-50 శాతం ఛార్జింగ్ ను పూర్తి చేయవచ్చు. ఫలితంగా తక్కువ ధరలో మెరుగైన ఫీచర్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా.. నార్జో 70X 5G స్మార్ట్ ఫోన్ f/1.8 అపేచర్ తో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. 2MP సెకండరీ కెమెరా సహా LED ఫ్లాష్ లైట్ తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








