Home
Mobile

రూ.6599 కే 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌తో స్మార్ట్‌ఫోన్.. ఇవాళే కొనుగోలు చేయవచ్చు..!

Realme Narzo 80 Lite 4G : రియల్‌మి నుంచి ఇటీవల రియల్‌మి 15 సిరీస్‌ విడుదల అయింది. దీంతోపాటు రియల్‌మి నార్జో 80 లైట్‌ 4G స్మార్ట్‌ఫోన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ రూ.10 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాళ ఈ రియల్‌మి నార్జో 80 లైట్‌ ఫోన్ ఫ్లాష్‌ సేల్‌ నిర్వహించనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.

రూ.6599 ధరకే! :
అయితే ఈ హ్యాండ్‌సెట్ సాధారణ సేల్ జులై 31 నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి నార్జో 80 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ ధర రూ.7299, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.8299 గా ఉంది. అయితే ప్రత్యేక వోచర్‌లతో కలిపి ఈ ఫోన్‌ను వరుసగా రూ.6599, రూ.7599 కే కొనుగోలు చేయవచ్చని రియల్‌మి చెబుతోంది.

realme narzo 80 lite 4G smartphone flash sale

ఇవాళ మధ్యాహ్నం నుంచి రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ఒబ్సిడియన్‌ బ్లాక్‌, బీచ్‌ గోల్డ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఫోన్ బ్యాక్‌ ప్యానల్‌ పల్స్‌ లైట్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. అంటే గ్లో స్ట్రిప్స్‌తో కూడిన 5 లైటింగ్‌ మోడ్స్‌ను కలిగి ఉంటుంది.

డిస్‌ప్లే వివరాలు :
రియల్‌మి నార్జో 80 లైట్‌ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. Unisoc T7250 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తుంది. రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

realme narzo 80 lite 4G smartphone flash sale

6W రివర్స్‌ ఛార్జింగ్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP Omnivision OV13B కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను అమర్చి ఉంది. మరియు 15W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు, 6W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6300mAh బ్యాటరీని కలిగి ఉంది.

మిలిటరీ గ్రేడ్ డ్రాప్‌ రెసిస్టెన్స్ :
ఈ రియల్‌మి ఫోన్ మిలిటరీ గ్రేడ్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉందని తెలిపింది. అంటే పొరపాటున కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతోపాటు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలిపింది.

realme narzo 80 lite 4G smartphone flash sale

రియల్‌మి 15 5G సిరీస్‌ వివరాలు :
ఈ సిరీస్ ఫోన్‌లు 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. బేస్ వేరియంట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ప్రో మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తాయి.

కెమెరా విభాగం పరంగా రియల్‌మి 15 ఫోన్ 50MP + 8MP కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అదే ప్రో మోడల్‌ 50MP + 50MP కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
realme narzo 80 lite 4G smartphone flash sale to start from today via amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X