రూ.7299 కే రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6300mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 OS తో పనిచేసే స్మార్ట్‌ఫోన్!
Realme Narzo 80 Lite 4G launched : రియల్‌మి నుంచి గత వారంలో C71 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అయితే ఇవాళ నార్జో 80 లైట్ 4G పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో విడుదల అయింది. ఎంట్రీ లెవల్ ధరలోనే అందుబాటులోకి వచ్చినా అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కలిగి ఉంది. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ భారీ బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మి నార్జో 80 లైట్ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7299 గా ఉంది. అయితే వోచర్‌లతో కలిపి ఈ ఫోన్ ను రూ.6599 కే కొనుగోలు చేయవచ్చని సంస్థ చెబుతోంది. అదే విధంగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8299 గా ఉంది. డిస్కౌంట్ తో కలిపి రూ.7599 కే కొనుగోలు చేయవచ్చని చెబుతోంది.

ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ జులై 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. అదే తొలి సేల్ జులై 31 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఒబ్సిడియన్ బ్లాక్, బీచ్ గోల్డ్ రెండు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
రియల్‌మి నార్జో 80 లైట్ 4G పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్ ను కలిగి ఉందని రియల్‌మి తెలిపింది. మరియు IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని తెలిపింది.
ఈ హ్యాండ్‌సెట్ Unisoc T7250 ఆక్టా కోర్ ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్ తో జతచేసి ఉంది. వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ద్వారా గరిష్ఠంగా 12GB వరకు ర్యా్మ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP Omnivision OV13B కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ రియల్‌మి ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 6W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6300mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ పల్స్ లైట్ ఫీచర్ ను కలిగి ఉంది. అంటే గ్లో స్ట్రిప్స్‌తో కూడిన 5 లైటింగ్ మోడ్స్‌ను కలిగి ఉన్నాయి. తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కావాలని భావిస్తున్న వారికి ఈ ఫోన్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్లస్ పాయింట్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








