Home
Mobile

రూ.7 వేల కంటే తక్కువ ధరలో 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తో స్మార్ట్‌ఫోన్‌..!

రియల్‌మి సంస్థ భారత్‌ లో ఈ సంవత్సరం అనేక మోడల్స్‌ ను లాంచ్‌ చేసింది. ఎంట్రీ లెవల్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ వరకు వివిధ ఫోన్‌లను విడుదల చేసింది. అయితే ఈ సంవత్సరం జులై లో రియల్‌మి నార్జో 80 లైట్‌ 4G స్మార్ట్‌ఫోన్‌ (Realme Narzo 80 Lite 4G Smartphone) విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ స్లిమ్‌ ప్రొఫైల్‌తో ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

డిస్కౌంట్‌ ఆఫర్ :
భారత్‌ మార్కెట్‌లో రియల్‌మి నార్జో 80 లైట్‌ 4G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7299, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.8299 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

realme Narzo 80 lite 4G smartphone

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.6,985 గా ఉంది. అదే 6GB వేరియంట్ ధర రూ.7,768 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ ను పొందవచ్చు. బీచ్‌ గోల్డ్‌, ఒబ్సిడియన్ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

మిలిటరీ గ్రేడ్‌ డ్రాప్‌ రెసిస్టెంట్‌ :
రియల్‌మి నార్జో 80 లైట్‌ 4G స్మార్ట్‌ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ డ్రాప్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ ఫోన్‌ బ్యాక్‌ ప్యానల్‌ పల్స్‌ లైట్‌ ఫీచర్‌ తో అందుబాటులో ఉంది. అంటే గ్లో స్ట్రిప్స్‌ తో 5 లైటింగ్‌ మోడ్స్‌ ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌ తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

HD+ డిస్‌ప్లే :
రియల్‌మి నార్జో ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. Unisoc T7250 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. వర్చువల్‌ ర్యామ్‌ ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తోంది.

భారీ డిస్‌ప్లే :
ఈ రియల్‌మి ఫోన్ ఎంట్రీ లెవల్‌ ధరలో అందుబాటులోకి వచ్చినా.. భారీ డిస్‌ప్లే ను కలిగి ఉంది. దీంతోపాటు రివర్స్‌ ఛార్జింగ్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు, 6W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6300mAh బ్యాటరీని కలిగి ఉంది.

300 శాతం అల్ట్రా వాల్యూమ్‌ ఫీచర్‌ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా, ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉంది. మెరుగైన ఆడియో కోసం 300 శాతం అల్ట్రా వాల్యూమ్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు స్మార్ట్‌ AI అసిస్టెంట్‌ ను కూడా కలిగి ఉంది. 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
realme Narzo 80 lite 4G smartphone with 6300mAh battery now available under Rs7000 on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X