Home
Mobile

రూ.9999 కే 6000mAh బ్యాటరీ, 6.56 అంగుళాల డిస్‌ప్లేతో 5G ఫోన్‌.. రూ.700 డిస్కౌంట్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి తాజాగా భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. రియల్‌మి నార్జో 80 లైట్‌ 5G పేరుతో లాంచ్ అయింది. ఈ ఫోన్‌ బడ్జెట్‌ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. మరియు మిలిటరీ గ్రేడ్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌ తోపాటు IP64 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ రియల్‌మి ఫోన్‌ ప్రారంభ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌ ను కూడా పొందవచ్చు.

రియల్‌మి నార్జో 80 లైట్‌ 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
రియల్‌మి నార్జో 80 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme Narzo 80 Lite 5G launched) 6.56 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 625 నిట్స్ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆర్మర్‌షేల్‌ టఫ్‌ బిల్ట్‌ ను కలిగి ఉంది. మరియు అంతర్గతంగా ఎయిర్‌బ్యాగ్‌ స్టైల్‌ షాక్‌ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది.

Realme Narzo 80 Lite 5G Smartphone launched in india with 6000mAh battery

ఈ డిస్‌ప్లే రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫోన్‌ 15W వైర్‌ ఛార్జింగ్‌, 5w రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 4GB లేదా 6GB ర్యామ్‌తో సపోర్టు చేస్తుంది. దీంతోపాటు వర్చువల్‌ గా 18GB వరకు ర్యామ్‌ను పొడిగించే వీలుంది. ఈ చిప్‌సెట్‌ 4,10,000 AnTuTu స్కోర్‌ను కలిగి ఉందని రియల్‌మి వెల్లడించింది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. గూగుల్‌ జెమిని సపోర్టును కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 32MP GC32E2 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా ఆటోఫోకస్‌ సపోర్టును కూడా కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్‌ యూనిట్‌ను అమర్చి ఉంది. ఈ ఫోన్‌ AI Clear Face వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్‌ 5G కనెక్టివిటీని సపోర్టు చేస్తుంది.

రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. ఈ ఫోన్ క్రిస్టల్‌ పర్పుల్‌, ఓనిక్స్‌ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్‌ పై రూ.500, 6GB ర్యామ్‌ వేరియంట్‌ పై రూ.700 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.9999 కే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. జూన్‌ 23 నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

FAQs
రియల్‌మి నార్జో 80 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ AI ను సపోర్టు చేస్తుందా?

ఈ ఫోన్ జెమిని ఇంటిగ్రేషన్‌తో అందుబాటులోకి వచ్చింది.

రియల్‌మి నార్జో 80 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టు చేస్తుందా?

అవును, ఈ ఫోన్ 5W రివర్స్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్‌ సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది?

ఈ ఫోన్ సేల్‌ జూన్ 23 నుంచి ప్రారంభం కానుంది. తొలి సేల్‌లో భాగంగా రెండు స్టోరేజీ వేరియంట్స్‌పై రూ.500, రూ.700 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

GizBot Technology
Best Mobiles in India

English summary
Realme Narzo 80 Lite 5G Smartphone launched in india with 6000mAh battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X