6000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 128GB స్టోరేజీతో రియల్‌మి 5G ఫోన్..!
రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. నార్జో 80 సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే రియల్‌మి నార్జో 80 సిరీస్‌లో నార్జో 80 ప్రో 5G, నార్జో 80x 5G ఫోన్‌లు విడుదల అయ్యాయి. తాజాగా రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్ గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి.
భారత్ మార్కెట్లో రియల్‌మి నార్జో 80 లైట్ 5G ఫోన్ (Realme Narzo 80 Lite 5G Smartphone) త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. 91మొబైల్స్ హిందీ కథనం ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ RMX3945 మోడల్ నంబర్‌ను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ వివరాలు :
తాజా నివేదిక ఆధారంగా ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే డిస్‌ప్లే పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరియు 6000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
రెండు స్టోరేజీ వేరియంట్స్ :
ఈ రియల్‌మి ఫోన్ మీడియాటెక్ డెమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఈ రిపోర్టు ఆధారంగా రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది.
ధర వివరాలు లీక్ :
91మొబైల్స్ రిపోర్టు ఆధారంగా 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.9,999, అదే 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంటుందని తెలుస్తోంది. రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ క్రిస్టల్ పర్పుల్, ఓనిక్స్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. త్వరలోనే ఈ ఫోన్ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* భారత్ మార్కెట్లో రియల్‌మి నుంచి ఇటీవలే రియల్‌మి C73 5G ఫోన్ విడుదల అయింది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ రియల్‌మి ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, Arm Mali MC2 GPU తోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 32MP కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
రియల్‌మి C73 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.10499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499 గా ఉంది. ఒనిక్స్ బ్లాక్, క్రిస్టల్ పర్పుల్, జాడే గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications