రూ.10499 కే 6000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఫోన్.. సేల్ ప్రారంభం..!
రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో గత వారం విడుదల అయింది. ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్. ఎయిర్‌బ్యాగ్ స్టైల్ షాక్ రెసిస్టెంట్‌గా ఉంది.
రియల్‌మి నార్జో 80 లైట్ 5G ధర వివరాలు :
రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో సేల్ (Realme Narzo 80 Lite 5G Smartphone Sale) ప్రారంభం అయింది.

రెండు కలర్ వేరియంట్స్ :
అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 4GB/128GB వేరియంట్‌పై రూ.500, 6GB/128GB వేరియంట్‌పై రూ.700 డిస్కౌంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఓనిక్స్ బ్లాక్, క్రిస్టల్ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ :
రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 625 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్‌తోపాటు ఆర్మర్‌షేల్ టఫ్ బిల్ట్ ను కలిగి ఉంది. దీంతోపాటు ఇంటర్నల్‌గా ఎయిర్‌బ్యాగ్ స్టైల్ షాక్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయని రియల్‌మి చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ను కలిగి ఉంది. మరియు గూగుల్ జెమిని సపోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 15W వైర్ ఛార్జింగ్, 5w రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ఆటోఫోకస్ సామర్థ్యంతో 32MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు LED ఫ్లాష్ యూనిట్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ AI Clear Face ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 5G ను సపోర్టు చేస్తుంది. డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది.
* గత నెలలో రియల్‌మి బడ్స్ ఎయిర్ 7 ప్రో ఇయర్‌బడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇన్ ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బడ్స్ 11mm, 6mm డ్యూయల్ dac డ్రైవర్లను కలిగి ఉంది. Hi Res ఆడియో వైర్‌లైస్ సర్టిఫికేషన్ మరియు LHDC ఆడియో కోడిక్‌ను సపోర్టు చేస్తుంది. 53dB ANC సపోర్టు చేస్తుంది.
రియల్‌మి బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 48 గంటల ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు. AI లైవ్ ట్రాన్స్‌లేటర్, ఫేస్ టూ ఫేస్ ట్రాన్స్‌లేటర్, AI inquiry టూల్‌ను కలిగి ఉంది. గూగుల్ జెమిని AI వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.4, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, స్విఫ్ట్ పెయిర్ ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications