Home
Mobile

రూ.9999 ధరకే 6000mAh బ్యాటరీ, ఎయిర్‌బ్యాగ్‌ స్టైల్‌ షాక్‌ రెసిస్టెంట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌..!

Realme Narzo 80 Lite 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి ఇటీవల P4 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. అయితే ఇప్పటికే రియల్‌మి భారత్ మార్కెట్‌లో ఎంట్రీ, బడ్జెట్‌ సెగ్మెంట్‌లో అనేక మోడల్స్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం రియల్‌మి నార్జో 80 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. రూ.10 వేల ధర రేంజ్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్, 6000mAh బ్యాటరీ తోపాటు పొరపాటున కిందపడినా డ్యామేజీ కాకుండా రక్షించే అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది.

అమెజాన్‌లో ప్రస్తుతం రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా రూ.10 వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. విడుదల సమయంలో ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,499 గా ఉంది.

Realme narzo 80 lite 5G smartphone pricecut

రూ.10 వేల కంటే తక్కువ ధరకే :
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ల ధరలు రూ.10499, రూ.10999 గా ఉన్నాయి. అంటే 6GB వేరియంట్‌ రూ.500 డిస్కౌంట్‌ను పొందింది. దీంతోపాటు ఈ రెండు వేరియంట్స్ పై రూ.500 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ రెండు మోడల్స్‌ ధరలు రూ.9999, 10499 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ క్రిస్టల్‌ పర్పుల్‌, ఓనిక్స్‌ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

రియల్‌మి నార్జో 80 లైట్‌ 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ రియల్‌మి ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.56 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 625 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఆర్మర్‌షేల్‌ టఫ్‌ బిల్ట్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

ఈ ఫీచర్‌ కారణంగా ఫోన్‌లో అంతర్గతంగా ఎయిర్‌బ్యాగ్‌ స్టైల్‌ షాక్‌ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఫలితంగా పొరపాటున కిందపడిన డ్యామేజీ కాకుండా ఉంటుంది. మరియు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే రెయిన్ వాటర్‌ స్మార్ట్‌ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.

Realme narzo 80 lite 5G smartphone pricecut

ఈ ఫోన్‌ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. వర్చువల్‌ ర్యామ్ ఆప్షన్‌ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. మరియు గూగుల్‌ జెమిని సపోర్టును కూడా కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 32MP కెమెరాను కలిగి ఉంది. మరియు LED ఫ్లా్ష్‌ను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక ఆర్టిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 15W వైర్‌ ఛార్జింగ్‌, 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

Best Mobiles in India

English summary
Realme narzo 80 lite 5G smartphone with 6000mAh battery and armour shell protection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X