రూ.10999 ధరకు ఎయిర్‌బ్యాగ్ స్టైల్ షాక్ రెసిస్టెంట్, 6000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్!
రియల్‌మి భారత్‌లో ఇటీవలే రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ ధరలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇటీవల బడ్జెట్ ధరలో 7000mAh బ్యాటరీతో రియల్‌మి C85 5G ఫోన్ విడుదల అయింది. ఈ నెల 4వ తేదీన రియల్‌మి P4x 5G హ్యాండ్‌సెట్ లాంచ్ కానుంది. ప్రస్తుతం రూ.10 వేల ధర సెగ్మెంట్‌లో ఆర్మర్ షెల్ టఫ్ బిల్ట్ ఫీచర్, 6000mAh బ్యాటరీతో రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 80 Lite 5G Smartphone) ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,499 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఆర్మర్ షెల్ టఫ్ బిల్ట్ ఫీచర్ :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ ఆర్మర్ షెల్ టఫ్ బిల్ట్ ఫీచర్ తో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఫోన్‌లో ఎయిర్‌బ్యాగ్ స్టైల్ షాక్ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఫలితంగా పొరపాటున కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి.
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది.
6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 32MP ప్రైమరీ కెమెరా, LED ఫ్లాట్ లైట్ ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 15W వైర్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ ఫోన్ ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు గూగుల్ జెమిని ఫీచర్ కూడా ఉంటుంది.
రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అయింది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది. రూ.500 డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ఈ ఫోన్ 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్, IP69 ప్రో రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP సోనీ IMX852 కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 45W SuperVOOC వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








