Home
Mobile

6000mAh బ్యాటరీ, 6.77 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాతో 5G ఫోన్.. ఇవాళ ప్రత్యేక సేల్‌, రూ.2000 డిస్కౌంట్‌..!

రియల్‌మి నార్జో 80 సిరీస్‌ ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా నార్జో 80x 5G, నార్జో 80 ప్రో 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు వేరియంట్స్‌ 6000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. డిజైన్ పరంగా ఈ మోడల్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రో మోడల్‌ రూ.20 వేల ధరలో లాంచ్ కాగా.. బేస్‌ వేరియంట్ రూ.13 వేల ధరలో అందుబాటులోకి వచ్చింది. రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 80 Pro 5G Smartphone) పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు.

రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ :
నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. అంటే బెస్ట్‌ వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌గా ఉంది. దీంతోపాటు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

Realme Narzo 80 Pro 5G

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల ఫుల్‌ HD+ (1080*2392 పిక్సల్స్‌) కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. 4500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 3840Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Eye ప్రొటెక్షన్‌ మోడ్‌ను కూడా కలిగి ఉంది.

చిప్‌సెట్ వివరాలు :
ఈ రియల్‌మి ప్రో వేరియంట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB LPDDR ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 తో పనిచేస్తుంది.

8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 6050mm2 VC కూలింగ్ సిస్టమ్‌ ను కలిగి ఉంది. మరియు 90fps BGMI సపోర్టును అందిస్తుంది.

కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంది. అలాగే 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 16MP కెమెరాను అమర్చారు.

ఈ నార్జో ప్రో మోడల్‌ 80W SuperVOOC ఛార్జింగ్‌, 65W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, WiFi 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ :
నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట ధర రూ.21,499, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,499 గా ఉంది.

ఈ ఫోన్‌ను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎర్లీ బర్డ్‌ సేల్‌ ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరగనుంది. ఎర్లీ బర్డ్‌ సేల్‌లో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ స్పీడ్‌ సిల్వర్‌, రేసింగ్‌ గ్రీన్‌, నిట్రో ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Realme Narzo 80 Pro 5G smartphone launched with 6000mAh Battery and Mediatek Dimensity 7400 Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X