Home
Mobile

మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో రియల్‌మి నుంచి కొత్త ఫోన్‌.. పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ కానుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. రియల్‌మి నార్జో 80 ప్రో 5G పేరుతో స్మార్ట్‌ఫోన్‌ (Realme Narzo 80 Pro 5G Smartphone) త్వరలో భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. గత సంవత్సరం రియల్‌మి నార్జో 70 ప్రో హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

అమెజాన్‌ ద్వారా సేల్‌ :
రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ గురించి రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోనూ లిస్టింగ్‌ అయింది. అయితే కచ్చితమైన తేదీ వెల్లడి కాలేదు. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్ అమెజాన్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే అమెజాన్ ఈ హ్యాండ్‌సెట్‌ కోసం లైవ్‌ పేజీని ప్రారంభించింది.

Realme Narzo 80 pro 5G smartphone

చిప్‌సెట్ :
ఈ రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని రియల్‌మి తెలిపింది. ఈ ఫోన్ 7,80,000 AnTuTU బెంచ్‌మార్క్ స్కోర్‌ను పొందినట్లు తెలుస్తోంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

Take a Poll

ధర వివరాలు :
ఈ రియల్‌మి నార్జో హ్యాండ్‌సెట్ రూ.20000 ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వస్తుంది అంచనా వేస్తున్నారు. మరియు రేసింగ్‌ గ్రీన్‌, స్పీడ్‌ సిల్వర్‌, నైట్రో ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. త్వరలో ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

రియల్‌మి నుంచి ఇటీవలే P3 5G, P3 అల్ట్రా ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. అల్ట్రా మోడల్‌ సేల్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అదే P3 వేరియంట్‌ సేల్‌ మార్చి 25 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో P3x 5G, ప్రో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ProXDR సపోర్టు చేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 3 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఈ ఫోన్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. మార్చి 26 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 1.5 మీటర్ల నీటి లోతులో 30 నిమిషాల వరకు డ్యామేజీ కాకుండా ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా రియల్‌మి P3 5G హ్యాండ్‌సెట్‌ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 80 pro 5G smartphone with mediatek dimensity 7400 chipset confirmed to launch in india soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X