రియల్‌మి నార్జో 80 సిరీస్ ఫోన్‌ల విడుదల తేదీ వెల్లడి.. చిప్‌సెట్, బ్యాటరీ, ధర వివరాలు లీక్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లోకి త్వరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. రియల్‌మి నార్జో 80 ప్రో 5G, నార్జో 80x 5G హ్యాండ్‌సెట్‌లు విడుదల కానున్నాయి. లాంచ్ వివరాలతోపాటు కొన్ని స్పెసిఫికేషన్లు, ధరల వివరాలను కూడా వెల్లడించింది. రియల్‌మి నార్జో 80 సిరీస్ లో (Realme Narzo 80 Series) భాగంగా ఈ రెండు ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి.
రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్, నార్జో 80x 5G ఫోన్ భారత్ మార్కెట్‌లో ఏప్రిల్ 9 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ realme.com మరియు అమెజాన్‌తోపాటు ఇతర రిటైల్ స్టోర్‌లతో అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి నార్జో 80 ప్రో 5G ఫోన్ : ఈ ఫోన్ (Realme Narzo 80 Pro 5G Smartphone) చిప్‌సెట్ వివరాలను గతంలోనే రియల్‌మి వెల్లడించింది. ఈ ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఫలితంగా గేమింగ్ సహా మల్టీ టాస్కింగ్ సమయంలో మెరుగైన పనితీరు కనబరుస్తుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ 7.5mm థిక్‌నెస్‌తో స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. మరియు ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్ 6050mm2 వీసీ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని పేర్కొంది.
రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 కంటే తక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ ధరలో డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే హ్యాండ్‌సెట్ ఇదేనని రియల్‌మి చెబుతోంది.
#ReadyToWin? Then gear up for the fastest gameplay ever! 💥
— realme narzo India (@realmenarzoIN) April 1, 2025
Game at peak performance with the #realmeNARZO80Pro5G & #realmeNARZO80x5G - featuring segment-leading power, seamless frame rates, and ultra-responsive controls.
Live & launching on Amazon Live, 9th April, 12 PM! 🔗… pic.twitter.com/emVa3Vvcgu
రియల్‌మి నార్జో 80x 5G ఫోన్ : రియల్ నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 80x 5G Smartphone)120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా విడుదల కానుంది.
ఈ బేస్ వేరియంట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలిపింది. నార్జో 80x 5G ఫోన్ రూ.15000 ధర సెగ్మెంట్‌లో లభిస్తుందని రియల్‌మి తెలిపింది.
* రియల్‌మి నుంచి ఇటీవలే P3 సిరీస్‌లో భాగంగా P3 5G, P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 తో పనిచేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.16999 గా ఉంది.
* రియల్‌మి P3 అల్ట్రా 5G ప్రారంభ ధర రూ.26999 గా ఉంది. 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. 50MP + 8MP + 16MP (సెల్ఫీ) కెమెరాను కలిగి ఉంది. 80W AI బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








