6000mAh బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ డిజైన్, 6.7 అంగుళాల డిస్‌ప్లేతో రియల్‌మి 5G ఫోన్‌లు.. రేపటి నుంచే సేల్..!
భారత్ మార్కెట్‌లో గత వారం రియల్‌మి నార్జో 80 సిరీస్ (Realme Narzo 80 Series) లాంచ్ అయింది. ఇందులో నార్జో 80 ప్రో 5G, నార్జో 80x 5G హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ సిరీస్ రేపు (ఏప్రిల్ 15 వ తేదీ) మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ సహా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా డిస్కౌంట్‌ను పొందవచ్చు. సన్‌లిట్ గోల్డ్, డీప్ ఓసియన్ రంగుల్లో లభిస్తుంది.

రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21499, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23499 గా ఉంది. స్పీడ్ సిల్వర్, రేసింగ్ గ్రీన్, నిట్రో ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
* రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoC ప్రాసెసర్ పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
ఈ నార్జో 80x 5G మోడల్ 7.94 థిక్‌నెస్‌తో సూపర్ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల FHD+ ఫ్లాట్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP69 రేటింగ్, సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
Too fast to stay on shelves.
— realme narzo India (@realmenarzoIN) April 14, 2025
First sale of #realmeNARZO80x5G starts tomorrow at 12PM.
Catch it before it slips.#ReadyToWin
Starting at ₹11,999*
Know More:https://t.co/n3vAbwM2m7: https://t.co/4x3MOLcTxl@amazonIN : https://t.co/Kdf1jtpPs9 pic.twitter.com/RFsWM7NGh6
* రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ప్రో మోడల్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తో అందుబాటులో ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77 అంగుళాల FHD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ప్రో వేరియంట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 6050mm Sq VC కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది.
Get it or regret it — no second chances.#realmeNARZO80Pro5G first sale goes live tomorrow at 12PM.#ReadyToWin
— realme narzo India (@realmenarzoIN) April 14, 2025
Starting at ₹17,999*
Know More:https://t.co/n3vAbwM2m7: https://t.co/LwHDEDlWLC@amazonIN : https://t.co/CfHOyU1EJq pic.twitter.com/mBz09C25ZU
ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. OIS సపోర్టుతో 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. మరియు 16MP (EIS) సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 16MP కెమెరాను అమర్చారు. 80W SuperVOOC ఛార్జింగ్, 65W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








