Home
Mobile

రూ.13999 ధరకే 128GB స్టోరేజీ, 6000mAh బ్యాటరీ, 6.72 అంగుళాల డిస్‌ప్లే 5G ఫోన్‌.. పూర్తి వివరాలు..!

రియల్‌మి నార్జో 80 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు ఇవాళ భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయ్యాయి. ఇందులో నార్జో 80x 5G, నార్జో 80 ప్రో 5G ఫోన్‌లు ఉన్నాయి. డిజైన్ పరంగా ఆకట్టుకుంటున్నాయి. నార్జో 80x 5G ఫోన్‌ (Realme Narzo 80X 5G Smartphone) సూపర్‌ స్లిమ్‌ గా ఉంది. బడ్జెట్ రేంజ్‌ లో అందుబాటులోకి వచ్చింది. మరియు 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 6.72 అంగుళాల ఫుల్ HD+ (1080*2400 పిక్సల్స్) ఫ్లా్ట్‌ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 690 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 20:09 యాస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంది.

Realme Narzo 80X 5G Smartphone

వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌ :
ఈ ఫోన్‌ స్లిమ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. 7.94mm థిక్‌నెస్‌తో సూపర్‌ స్లిమ్‌ గా అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ బరువు 197 గ్రాములుగా ఉంది. మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

చిప్‌సెట్, OS చిప్‌సెట్ వివరాలు :
ఈ రియల్‌మి ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB LPDDR4x ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది.

Realme Narzo 80X 5G Smartphone

కెమెరా, బ్యాటరీ వివరాలు :
ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాలను అమర్చారు. ఈ ఫోన్‌ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, WiFi 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సన్‌లిట్‌ గోల్డ్‌, డీప్‌ ఓసియన్‌ రంగుల్లో లభిస్తుంది.

రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ :
రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. నార్జో 80x 5G ఫోన్‌ ఎర్లీ బర్డ్‌ సేల్‌ ఏప్రిల్ 11 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు జరగనుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు

Best Mobiles in India

English summary
Realme Narzo 80X 5G Smartphone launched with 6000mAh Battery and super slim design in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X