Home
Mobile

రూ.12999 ధరకే వాటర్‌ ప్రూఫ్‌ స్మార్ట్‌ఫోన్‌.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా సహా బెస్ట్‌ ఫీచర్లు..!

Realme Narzo 80x 5G Smartphone : రియల్‌మి నుంచి ఇటీవల 15 సిరీస్‌ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. అయితే ఇప్పటికే రియల్‌మి నుంచి అనేక బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రియల్‌మి నార్జో 80 సిరీస్‌ లాంచ్‌ అయింది. ఇందులో నార్జో 80x 5G, నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అమెజాన్‌లో నార్జో 80x మోడల్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు కూపన్ కోడ్‌ కూడా అందుబాటులో ఉంది.

రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌ ఈ ఫోన్‌లపై డిస్కౌంట్‌ను అందిస్తోంది. 6GB ర్యామ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.12999 కే అందుబాటులో ఉంది.

Realme Narzo 80x 5G Smartphone features

రూ.1500 డిస్కౌంట్‌ :
అదే 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.13999 గా ఉంది. దీంతోపాటు కూపన్‌ కోడ్‌ ద్వారా రూ.500 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అంటే రూ.13499 కే కొనుగోలు చేయవచ్చు. అంటే మొత్తంగా రూ.1500 డిస్కౌంట్‌ను పొందచ్చు. ఈ ఫోన్‌ డీప్‌ ఓసియన్‌, సన్‌లిట్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

మంచి వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్ :
రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.72 అంగుళాల ఫుల్ HD+ ఫ్లా్ట్‌ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 690 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. బడ్జెట్‌ ధరలో బెస్ట్‌ వాటర్‌ ప్రూఫ్‌ మోడల్‌గా ఉంది.

Realme Narzo 80x 5G Smartphone features

మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెంట్‌ :
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెంట్‌ గా ఉంది. మరియు సూపర్‌ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది.

భారీ బ్యాటరీ, 50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ రియల్‌మి ఫోన్ 5G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు 4G LTE, వైపై 6, బ్లూటూత్‌ 5.4, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 80x 5G Smartphone with IP69 Rating now available at Rs12999 Price on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X