Home
Mobile

7000mAh బ్యాటరీ, 50MP కెమెరా సహా ఆకట్టుకొనే డిజైన్‌తో రియల్‌మి ఫోన్‌..!

Realme Narzo 90 5G Series : రియల్‌మి నార్జో 90 సిరీస్‌ ఫోన్‌ లు భారత్‌ మార్కెట్‌ లో డిసెంబర్ 16 వ తేదీన లాంచ్‌ కానున్నాయి. ఈ సిరీస్‌ లో నార్జో 90 5G, నార్జో 90x 5G ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌ అమెజాన్‌ లో సేల్‌ ప్రారంభం కానుంది. దీంతోపాటు ప్రత్యేక మైక్రోసైట్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ఆధారంగా ఈ సిరీస్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ సిరీస్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

7000mAh బ్యాటరీ, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ :
రియల్‌మి నార్జో 90 5G, నార్జో 90x 5G ఫోన్‌లు స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు అమెజాన్‌ ( Amazon ) మైక్రోసైట్‌ ద్వారా వెల్లడయ్యాయి. బ్యాటరీ విభాగం పరంగా నార్జో 90 5G ఫోన్ 7000mAh టైటాన్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 60W ఫాస్ట్ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుంది. బైపాస్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

realme narzo 90 5G series

ఈ ఫోన్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 143.7 గంటలపాటు మ్యూజిక్‌ కోసం ఉపయోగించుకోవచ్చు. లేదా 80 గంటల గేమింగ్‌ లేదా 24 గంటల ఆన్‌లైన్‌ వీడియో లేదా 28.2 గంటలపాటు ఆన్‌లైన్‌ మీటింగ్‌ కోసం వినియోగించుకోవచ్చని రియల్‌మి చెబుతోంది.

నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌ :
అదే నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌ ( Realme Narzo 90x 5G Smartphone ) 6000mAh టైటాన్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. 60W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి 17.1 గంటలపాటు నేవిగేషన్ లేదా 61.3 గంటల కాలింగ్ లేదా 136.2 గంటల మ్యూజిక్‌ లేదా 27.7 గంటల పాటు ఛాటింగ్‌ లేదా 23.6 గంటలపాటు ఆన్‌లైన్‌ వీడియో కోసం ఉపయోగించుకోవచ్చని రియల్‌మి చెబుతోంది.

4000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 50MP కెమెరా :
ఈ నార్జో 90 సిరీస్‌ ఫోన్లు పంచ్ హోల్‌ డిజైన్‌ ను కలిగి ఉంటాయి. అయితే నార్జో 90 5G ఫోన్‌ 4000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 90x 5G ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 1200 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటాయి. కెమెరా విభాగం పరంగా నార్జో 90 5G ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరాతో మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. అదే నార్జో 90x 5G ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరాతో రెండు కెమెరాలను కలిగి ఉంటుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
దీంతోపాటు AI Edit Genie, AI Editor, AI Eraser, AI Ultra Clarity వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌ లను కలిగి ఉంది. ఈ సిరీస్‌ డిసెంబర్‌ 16 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme narzo 90 5G series confirmed specifications, features ahead of launch on december 16 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X