50MP + 50MP కెమెరాలు, 7000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. అమెజాన్‌లో ఆఫర్..!
భారత్ మార్కెట్‌లో ఇటీవల రియల్‌మి 16 ప్రో 5G సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 16 ప్రో 5G, 16 ప్రో ప్లస్ 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 200MP కెమెరా. 7000mAh బ్యాటరీ సహా అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. అయితే గత నెలలో రియల్‌మి నార్జో 90, 90x ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం నార్జో 90 5G హ్యాండ్‌సెట్‌ను (Realme Narzo 90 5G Smartphone) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
కూపన్ కోడ్ డిస్కౌంట్‌తోపాటు :
రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16998, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18498 గా ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో (Amazon Great Republic Day Sale 2026) అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో భాగంగా రూ.1000 కూపన్ కోడ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

కలర్ వేరియంట్స్ :
కూపన్ కోడ్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ.15998, రూ.17498 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు SBI బ్యాంకు క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ విక్టరీ గోల్డ్, కార్బన్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఫుల్ HD+ డిస్‌ప్లే :
రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.57 అంగుళాల అమోలెడ్ ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
చిప్‌సెట్, OS :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. Mali G57 MC2 GPU ను కూడా అమర్చి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది.
50MP + 50MP సెల్ఫీ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

7000mAh బ్యాటరీ :
రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi, బ్లూటూత్ 5.3, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








