7000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్!
Realme Narzo 90 5G Smartphone : రియల్‌మి నార్జో 90 సిరీస్ భారత్ మార్కెట్ లో లాంచ్ అయింది. ఈ సిరీస్ లో భాగంగా రియల్‌మి నార్జో 90 5G, నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్ ఫోన్‌లు అనేక ప్రత్యేక ఫీచర్ లను కలిగి ఉన్నాయి. ఈ నార్జో 90 5G ఫోన్ 7000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.57 అంగుళాల అమోలెడ్ ఫుల్ HD+ ( 1080 x 2372 పిక్సల్స్ ) డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 397 PPI పిక్సల్స్ డెన్సిటిని కలిగి ఉంది.

మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ :
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. దీంతోపాటు Mali G57 MC2 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది.
50MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. 2MP మోనోక్రోమ్ సెన్సర్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తుంది.
7000mAh భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ IP66 + IP68 + IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, GPS, QZSS, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి.

రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18499 గా ఉంది. కూపన్ కోడ్ తో రూ.1000 తగ్గింపును అందిస్తుంది.
ఈ ఫోన్ సేల్ డిసెంబర్ 24 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. కార్బన్ బ్లాక్, విక్టరీ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








