Home
Mobile

రూ.15999 ధరకు 7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాల 5G స్మార్ట్‌ఫోన్‌.. ఇవాళే సేల్‌..!

Realme Narzo 90 5G Smartphone Sale : రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల రియల్‌మి నార్జో 90 5G సిరీస్‌ విడుదల అయింది. ఇందులో నార్జో 90x 5G, నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్‌ లు ఉన్నాయి. డిసెంబర్‌ 23 నుంచి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం అయింది. ఇవాళ్టి నుంచి నార్జో 90 5G ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 7000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

రూ.1000 డిస్కౌంట్‌ :
రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18499 గా ఉంది. రియల్‌మి వైబ్‌సైట్‌, అమెజాన్‌ లో (Amazon) కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి వెబ్‌సైట్‌ లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అదే అమెజాన్‌ తో కూపన్‌ కోడ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Realme narzo 90 5G smartphone first sale

డిస్‌ప్లే వివరాలు, మెరుగైన వాటర్‌ రెసిస్టెంట్‌ :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.57 అంగుళాల అమోలెడ్‌ ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1400 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది.

మీడియాటెక్‌ చిప్‌, ఆండ్రాయిడ్‌ 15 OS :
రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 మ్యాక్స్‌ ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్‌, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. Mali G57 MC2 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 తో పనిచేస్తుంది.

50MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్‌ సెన్సర్‌ లు ఉన్నాయి. ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Realme narzo 90 5G smartphone first sale

7000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌ :
రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్‌ 60W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్‌ 5.3, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ విక్టరీ గోల్డ్‌, కార్బన్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme narzo 90 5G smartphone with 7000mAh battery, 50MP Selfie camera sale to start from today
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X