7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్!
Realme Narzo 90 5G Smartphone : రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్ లో గత సంవత్సరం డిసెంబర్ లో రియల్‌మి నార్జో 90 5G సిరీస్ విడుదల అయింది. ఇందులో భాగంగా నార్జో 90 5G, నార్జో 90x 5G ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అమెజాన్ లో నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ పై తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్ల వివరాలు.
కూపన్ కోడ్ డిస్కౌంట్ :
రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18,499 గా ఉంది. కూపన్ కోడ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

కలర్ వేరియంట్స్ :
దీంతో ఈ ఫోన్ ను రూ.15999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ విక్టరీ గోల్డ్, కార్బన్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
అమోలెడ్ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ :
రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ 6.57 అంగుళాల అమోలెడ్ ఫుల్ HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ రియల్‌మి ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జత చేసి ఉంటుంది. దీంతోపాటు Mali G57 MC2 GPU కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది.
50MP కెమెరా :
ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తుంది.
IP66 + IP68 + IP69 రేటింగ్ :
కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.3, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP66 + IP68 + IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. డిజైన్ పరంగానూ ఈ ఫోన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








